తెలంగాణ BHM అడ్మిషన్ 2023 (Telangana BHM Admission 2023) - తేదీలు , అర్హత, దరఖాస్తు, ఎంట్రన్స్ పరీక్షలు, ఎంపిక ప్రక్రియ, టాప్ కళాశాలలు

Guttikonda Sai

Updated On: October 04, 2023 04:47 pm IST

Telangana BHM Admission 2023 అప్లికేషన్ గడువు ముగిసింది. Telangana BHM Admission 2023 గురించిన ముఖ్యమైన తేదీలు, కళాశాలల జాబితా, ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

Telangana BHM Admission

Telangana BHM Admission 2023 : హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో డిగ్రీ పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలలు ఉన్నాయి. ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా 10+2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ పరీక్ష ఏదీ నిర్వహించడం లేదు. అయితే NCHMCT JEE 2023 పరీక్ష ద్వారా విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. NCHMCT JEE 2023 పరీక్ష కోసం ఫిబ్రవరి 2వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది, ఈ దరఖాస్తు ఏప్రిల్ 27, 2023 తేదీతో ముగిసింది. Telangana BHM Admission 2023 కోసం అవసరమైన సమాచారం మొత్తం ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని BHM కళాశాలల వివరాలు కూడా ఈ ఆర్టికల్ లో వివరంగా ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ద్వారా అత్యధిక జీతం వచ్చే ఉద్యోగాలు లభిస్తూ ఉండడంతో ఈ కోర్సులకు క్రేజ్ పెరిగింది. తెలంగాణ హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

Telangana BHM Admission 2023 ముఖ్యమైన తేదీలు (Telangana BHM Admissions Important Dates 2023)

Telangana BHM Admission 2023 గురించిన ముఖ్యమైన తేదీల వివరాలు క్రింది పట్టిక లో గమనించగలరు.

కార్యక్రమం

తేదీలు

అప్లికేషన్ ప్రారంభం

02, ఫిబ్రవరి 2023

అప్లికేషన్ చివరి తేదీ 27 ఏప్రిల్ 2023

అడ్మిషన్ ప్రాసెస్

జూన్ 2023

తరగతుల ప్రారంభం

జూలై  2023

Telangana BHM Admission 2023 అర్హత ప్రమాణాలు (Telangana BHM Admission Eligibility Criteria 2023)

Telangana BHM Admission 2023 కోసం విద్యార్థులు కొన్ని అర్హతలను ఖచ్చితంగా పాటించాలి. BHM కోర్సులో జాయిన్ అవ్వడానికి కావాల్సిన అర్హతలు ఇక్కడ గమనించవచ్చు.

  • BHM కోర్సులో జాయిన్ అవ్వడానికి విద్యార్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లేదా 10+2 లో అర్హత సాధించాలి.
  • 10+2 తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టు ను తప్పని సరిగా చదివి ఉండాలి.
  • కొన్ని BHM కళాశాలలు ఇంటర్మీడియట్ లో 50% మార్కులు సాధించిన వారికి మాత్రమే అడ్మిషన్ ఇస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆ మార్కులను సాధించాలి.

Telangana BHM Admission 2023 దరఖాస్తు విధానం (How to Apply for Telangana BHM Admissions 2023)

Telangana BHM Admission 2023 కోసం విద్యార్థులు రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు ,అవి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. విద్యార్థులు దరఖాస్తు విధానం క్రింది స్టెప్స్ లో తెలుసుకోవచ్చు.

ఆన్‌లైన్

స్టెప్ 1: ఎంచుకున్న కళాశాల యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

స్టెప్ 2: " Apply Now " అని ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 3: తెలంగాణ BHM అప్లికేషన్ ఫార్మ్ లో మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా మరియు ఇతర అవసరమైన డీటెయిల్స్ నమోదు చేయండి

స్టెప్ 4: అవసరమైన పత్రాలను జతచేసి దరఖాస్తు రుసుము చెల్లించండి

స్టెప్ 5: పూర్తి చేసిన అప్లికేషన్ ఫార్మ్ ని సబ్మిట్ చేయండి.

స్టెప్ 6 : భవిష్యత్ అవసరం కోసం అప్లికేషన్ ఫార్మ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి

ఆఫ్‌లైన్

అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్‌లో తెలంగాణాలో BHM అడ్మిషన్ (Telangana BHM Admission 2023) కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు కళాశాల వెబ్‌సైట్ నుండి తెలంగాణ BHM అడ్మిషన్ కోసం అప్లికేషన్ ఫార్మ్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ మోడ్‌లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా దరఖాస్తు రుసుమును సమర్పించవచ్చు. వారు ఎంచుకున్న కళాశాల యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి డీటెయిల్స్ మరియు అప్లికేషన్ ఫార్మ్ ని చెక్ చేయవచ్చు.

Telangana BHM Admission 2023 కు అవసరమైన పత్రాలు (Documents Required for Telangana BHM Admissions 2023)

Telangana BHM Admission కోసం అవసరమైన డాక్యుమెంట్ల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.

  • 10వ తరగతి  మార్క్ షీట్ మరియు సర్టిఫికేట్

  • ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్

  • పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్

  • ఇంటర్మీడియట్ మార్క్ షీట్ మరియు సర్టిఫికేట్

  • మైగ్రేషన్ సర్టిఫికేట్

  • గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్, ఓటర్ ID లేదా పాస్‌పోర్ట్)

Telangana BHM  కళాశాలలు ఆమోదించే ఎంట్రన్స్ పరీక్షలు (Entrance Exams Accepted by Telangana BHM Colleges 2023)

తెలంగాణలో BHM అడ్మిషన్ కి రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్ష లేదు. అయినప్పటికీ, కొన్ని కళాశాలలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్  ( NCHMCT JEE)  వంటి జాతీయ స్థాయి హోటల్ మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ పరీక్షలను అంగీకరిస్తాయి. సి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యూలినరీ ఆర్ట్స్ మరియు రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ వంటి సంస్థలు BHM అడ్మిషన్ (Telangana BHM Admission 2023) కోసం తమ సొంత ఆప్టిట్యూడ్ పరీక్షను నిర్వహిస్తాయి. రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ రీజెన్సీ ఆల్ ఇండియా ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తుండగా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యూలినరీ ఆర్ట్స్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (CEE)ని నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, రీజనింగ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలను కవర్ చేస్తాయి. విద్యార్థులు ఆయా కళాశాలల అధికారిక వెబ్సైట్ల నుండి మరింత సమాచారం పొందవచ్చు.

Telangana BHM Admission 2023 కోసం ఎంట్రన్స్ పరీక్షలు చాలా వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి. తెలంగాణలోని ప్రైవేట్ BHM కళాశాలలు వారు ఇన్‌స్టిట్యూట్ స్థాయిలో నిర్వహించే BHM ఎంట్రన్స్ పరీక్షకు హాజరు కావడానికి విద్యార్థులు స్లాట్ లను బుక్ చేసుకోవాలి. అటువంటి సందర్భాలలో, దరఖాస్తుదారులు ఎంచుకున్న స్లాట్‌ల ప్రకారం పరీక్షలు నిర్వహించబడతాయి. విద్యార్థులు బుక్ చేసుకున్న స్లాట్‌లకు కేటాయించిన తేదీ మరియు సమయం ప్రకారం పరీక్షకు హాజరు కావాలి. సాధారణంగా, ఈ ఇన్‌స్టిట్యూట్‌లు పరీక్ష పూర్తయిన 2-3 పని దినాలలో ఫలితాలను ప్రకటిస్తాయి.

పరీక్ష యొక్క సిలబస్ సంబంధిత కళాశాలల వెబ్‌సైట్‌లో చూడవచ్చు. తెలంగాణలోని కొన్ని బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలు మరియు వారు ఆమోదించే  ఎంట్రన్స్ పరీక్షలు క్రింద ఇవ్వబడ్డాయి:

కళాశాల పేరు

ఎంట్రన్స్ పరీక్ష

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, హైదరాబాద్

NCHMCT JEE

డాక్టర్, YSR నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హైదరాబాద్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ శ్రీ శక్తి, హైదరాబాద్

రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, హైదరాబాద్

రీజెన్సీ NET

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కలినరీ ఆర్ట్స్ (IIHMCA), హైదరాబాద్

CEE

Telangana BHM Admission 2023 సెలెక్షన్ ప్రాసెస్ (Telangana BHM Selection Process 2023)

Telangana BHM Admission 2023 కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంటర్మీడియట్  పరీక్షలో వారి పనితీరు ఆధారంగా ఎంపిక చేయబడతారు. కొన్ని కళాశాలలు ఎంపిక కోసం కళాశాల నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలలో విద్యార్థుల పనితీరును కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. వ్రాత పరీక్ష పూర్తయిన తర్వాత, విద్యార్థులను ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా ఉంది. ఇంటర్వ్యూ పూర్తి అయ్యాక షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్‌కు పిలుస్తారు. ఆ తర్వాత, విద్యార్థులు  ట్యూషన్ ఫీజును చెల్లించి, వారి అడ్మిషన్ ని నిర్ధారించవచ్చు. భవిష్యత్ సూచన కోసం వారు కళాశాల నుండి ఫీజు రిసిప్ట్ ను సేకరించవచ్చు. విద్యార్థులు మరింత వివరమైన సమాచారం కోసం మరియు అడ్మిషన్ ప్రక్రియను తెలుసుకోవడానికి కళాశాల యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Telangana BHM Admission 2023 అత్యుత్తమ కళాశాలలు (Top BHM Colleges in Telangana)

తెలంగాణ రాష్ట్రంలో BHM కోర్సు అందించే కళాశాలల జాబితా మరియు ఆయా కళాశాలల్లో ఫీజుల వివరాలు క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

సంస్థ పేరు

కోర్సు ఫీజులు (1వ సంవత్సరం ఫీజు)

Institute of Hotel Management Catering Technology and Applied Nutrition, Hyderabad

INR 130,250

NITHM, హైదరాబాద్

INR 2,89,000

రీజెన్సీ కాలేజ్ ఆఫ్ కలినరీ ఆర్ట్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్

INR 99,000

CAIIHM, హైదరాబాద్

INR 1,08,900

Pioneer Institute of Hotel Management, Hyderabad

INR 88,000

AIMS కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, హైదరాబాద్

INR 85,000

Sun International Institute of Tourism and Hotel Management, హైదరాబాద్

INR 4,50,500

వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్

INR 1,00,000

ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్

INR 2,5,000- 4,50,000

Telangana BHM Admission 2023 స్కాలర్‌షిప్‌లు (Telangana BHM Admission Scholarships)

తెలంగాణలో BHM అడ్మిషన్ కోసం హోటల్ మేనేజ్‌మెంట్ స్కాలర్‌షిప్‌లు సాధారణంగా విద్యార్థులకు అందించబడతాయి. సన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్‌మెంట్ సంస్థ వారి విద్యార్థులకు ప్రత్యేకంగా 80,000 రూపాయల వరకు స్కాలర్‌షిప్ ను అందిస్తున్నాయి.ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు, విద్యార్థులు అప్లికేషన్ ఫార్మ్ ని పూరించాలి మరియు అవసరమైన డీటెయిల్స్ ని అందించాలి.

తెలంగాణ BHM అడ్మిషన్ ద్వారా లభించే ఉద్యోగాల జాబితా ( Telangana BHM Career Opportunities)

హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు ఈ క్రింది ఉద్యోగాలను పొందవచ్చు.
  • హోటల్ మేనేజర్
  • రెస్టారెంట్ మేనేజర్
  • బ్యాంకేట్ మేనేజర్
  • ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్
  • ఫుడ్ అండ్ బీవరేజెస్ మేనేజర్
  • సేల్స్ మార్కెటింగ్ మేనేజర్
  • ఈవెంట్ మేనేజర్
  • టూర్ మేనేజర్ మొదలైనవి.

విద్యార్థులు మా Common Application Form ని పూరించడం ద్వారా మా నిపుణుల సలహాలు పొందవచ్చు. విద్యార్థులు మా టోల్-ఫ్రీ నంబర్ 1800-572-9877కు కూడా కాల్ చేయవచ్చు. ఇది కాకుండా, BHM కోర్సులు మరియుTelangana BHM Admission 2023 కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నవారు Collegedekho QnA zone లో ప్రశ్నలు అడగవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

FAQs

తెలంగాణలో BHM అడ్మిషన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

విద్యార్థులు కళాశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఫార్మ్ ని పూరించడం ద్వారా తెలంగాణలోని BHM అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారు గడువులోపు అప్లికేషన్ ఫార్మ్ ని సమర్పించాలి.

తెలంగాణ BHM అడ్మిషన్లకు ఏ పత్రాలు అవసరం?

తెలంగాణ BHM అడ్మిషన్‌లకు అవసరమైన కొన్ని పత్రాలు 10వ మరియు 12వ మార్కు షీట్‌లు, మైగ్రేషన్ సర్టిఫికేట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్.

తెలంగాణలో BHM అడ్మిషన్ కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?

12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పరీక్షలో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కొన్ని కాలేజీలు ఎంపిక కోసం ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తాయి.

తెలంగాణలో BHM అడ్మిషన్ ని అందిస్తున్న టాప్ కళాశాలలు ఏవి?

తెలంగాణలో BHM అడ్మిషన్ ని అందిస్తున్న కొన్ని ప్రసిద్ధ కళాశాలలు రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ, హైదరాబాద్, SUN ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టూరిజం & మేనేజ్‌మెంట్, హైదరాబాద్ మరియు ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్, హైదరాబాద్.

తెలంగాణలో BHM అడ్మిషన్ కి అర్హత ప్రమాణాలు అంటే ఏమిటి?

ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు తెలంగాణలో BHM అడ్మిషన్ కి అర్హులు.

/articles/telangana-bhm-admission/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Hotel Management Colleges in India

View All
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!