TS AGRICET 2023 రిజిస్ట్రేషన్ (TS AGRICET 2023 Registration) ప్రారంభం అయ్యింది, ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు

Guttikonda Sai

Updated On: July 03, 2023 07:09 PM

TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (TS AGRICET 2023 Passing Marks) గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. TS AGRICET 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ 01 జూలై 2023 తేదీన ప్రారంభం అయ్యింది, ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (TS AGRICET 2023 Passing Marks)

TS AGRICET ఉత్తీర్ణత మార్కులు 2023 : తెలంగాణ అగ్రిసెట్ 2023 నోటిఫికేషన్ 01 జూలై 2023 తేదీన విడుదల అయ్యింది. TS AGRICET 2023 పరీక్షను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. TS AGRICET 2023 పరీక్ష ద్వారా కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత మార్కులు సాధించాలి. TS AGRICET 2023 పరీక్ష ఆన్లైన్ మోడ్ లో తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు. TS AGRICET 2023 పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కుల గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ ( TS AGRICET 2023 Application Form Direct Link)

TS AGRICET 2023 పరీక్షకు అప్లై చేయడానికి అభ్యర్థులు క్రింది ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి.

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి

TS AGRICET 2023 ముఖ్యమైన తేదీలు 2023 ( TS AGRICET 2023 Important Dates)

TS AGRICET 2023 పరీక్షకు గురించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

విషయం

తేదీ

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల

01 జూలై 2023

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా)

22 జూలై 2023

TS AGRICET 2023 పరీక్ష తేదీ

26 ఆగష్టు 2023

TS AGRICET 2023 ఫలితాలు

సెప్టెంబర్ 2023

TS AGRICET 2023 కౌన్సెలింగ్

సెప్టెంబర్ 2023

TS AGRICET 2023 పరీక్ష విధానం 2023 (TS AGRICET 2023 Exam Pattern)

TS AGRICET 2023 పరీక్ష విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

పరీక్ష మోడ్

ఆన్లైన్

మీడియం

ఇంగ్లీష్ మరియు తెలుగు

పేపర్ల సంఖ్య

1

ప్రశ్నల విధానం

మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు

కేటాయించిన సమయం

2 గంటలు

మొత్తం మార్కులు

100

TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (TS AGRICET 2023 Passing Marks)

TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా విభజించబడ్డాయి, TS AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు 25% మార్కులను సాధించాలి అంటే 120 మార్కులకు 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కుల నిబంధన లేదు. ఈ కేటగిరీ అభ్యర్థులకు వారికి కల్పించిన రిజర్వేషన్ ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది.

TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు.

కేటగిరీ

ఉత్తీర్ణత మార్కులు

ఓపెన్ కేటగిరీ

25% (120 కు 30 మార్కులు)

SC/ST

కనీస ఉతీర్ణత మార్కులు లేవు

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ (TS AGRICET 2023 Application Form)

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ జూలై నెల నుండి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది. B.Sc Hons అగ్రికల్చర్ , B.Tech అగ్రికల్చర్ లో అడ్మిషన్ పొందాలి అనుకునే విద్యార్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ ను పూర్తి చేయాలి. TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ క్రింది ఇచ్చిన టేబుల్ లో గమనించవచ్చు.

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి

TS AGRICET 2023 కౌన్సెలింగ్ (TS AGRICET 2023 Counselling)

TS AGRICET 2023 కౌన్సెలింగ్ ఆగస్టు 2023 నెలలో జరుగుతుంది. TS AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారికి కేటాయించిన తేదీన కౌన్సెలింగ్ కేంద్రంలో హాజరు అవ్వాలి. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. విద్యార్ధులకు సీటు కేటాయించిన తర్వాత నిర్దిష్ట సమయంలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలి.

TS AGRICET 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను చూస్తూ ఉండండి.


Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-agricet-passing-marks/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top