TS EAMCET ద్వారా అడ్మిషన్ లభించే కోర్సుల జాబితా ( Courses offered through TS EAMCET)  మరియు ఎలిజిబిలిటీ  డీటెయిల్స్

Guttikonda Sai

Updated On: March 25, 2024 05:19 PM | TS EAMCET

అభ్యర్థులు TS EAMCET 2024 స్కోర్‌ ఆధారంగా  అడ్మిషన్ లభించే  కోర్సుల జాబితాను('List of Courses for Admission through TS EAMCET) ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు మరియు ఆయా కోర్సులలో జాయిన్ అవ్వడానికి అవసరమైన అర్హత ప్రమాణాలను కూడా తెలుసుకోవచ్చు.

TS EAMCET Courses List and their Eligibility Criteria

TS EAMCET ద్వారా అడ్మిషన్ లభించే కోర్సుల జాబితా : TS EAMCET పరీక్షను Jawaharlal Nehru Technological University (JNTU) Hyderabad ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ కళాశాలల ద్వారా B.Sc Agriculture, B.Pharm, B.Tech, కోర్సులలో అడ్మిషన్ పొందడానికి TS EAMCET పరీక్ష వ్రాయాల్సి ఉంటుంది. TS EAMCET అభ్యర్థులు పరీక్షకు అర్హత సాధించిన తర్వాత అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు వారి వివరణాత్మక అర్హత ప్రమాణాలు ఈ ఆర్టికల్ లో  ప్రత్యేకంగా అందించాము.

ఈ సంవత్సరం, TS EAMCET 2024 పరీక్ష మే 7 నుండి 11, 2024 వరకు జరగాల్సి ఉంది. ఫలితాల ప్రకటన తర్వాత, షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు TS EAMCET 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ మరియు వారి ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు కోసం పిలవబడతారు.

ఇది కూడా చుడండి - తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024

TS EAMCET 2024 కాలేజ్ ప్రెడిక్టర్ TS EAMCET 2024 ర్యాంక్ ప్రెడిక్టర్

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ త్వరలో TS EAMCET 2024 పరీక్ష గురించి అధికారిక నోటిఫికేషన్‌ను దాని అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in లో విడుదల చేస్తుంది. TS EAMCET 2024 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024‌ని పేర్కొన్న చివరి తేదీలోపు పూరించాలి. TS EAMCET 2024 పరీక్షకు సంబంధించిన తేదీలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ, పరీక్షల నమూనా మొదలైన వివరాలను దిగువ విభాగాల నుంచి చెక్ చేయవచ్చు.

TS EAMCET అనేది తెలంగాణలోని B.Tech/ B.Pharma/ B.Sc అగ్రికల్చర్/ హార్టికల్చర్/ ఫిషరీస్/ Pharma.D కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించబడే ప్రవేశ పరీక్ష. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున JNTU హైదరాబాద్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. TS EAMCET ద్వారా ప్రవేశానికి EWS కోటా కోసం 10 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.

TS EAMCET 2024 పరీక్ష ముఖ్యాంశాలు (TS EAMCET Exam 2024 Highlights)

TS EAMCET 2024 పరీక్షకు సంబంధించిన ముఖ్యాంశాలు  దిగువ టేబుల్లో ఉంచబడ్డాయి -

పరీక్ష పేరు

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET)

కండక్టింగ్ బాడీ

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE)

TS EAMCET 2024 అగ్రికల్చర్ పరీక్ష తేదీలు

మే 07 నుండి 11 , 2024 .

TS EAMCET 2024 ఇంజనీరింగ్ పరీక్ష తేదీలు

మే 07 నుండి 11 , 2024 .

పరీక్షా విధానం

ఆన్‌లైన్

గరిష్ట మార్కులు

160

మొత్తం ప్రశ్నల సంఖ్య

160

అడ్మిషన్ ప్రాసెస్

TSCHE నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా

సంబంధిత కథనాలు

TS EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ TS EAMCET 2024 సిలబస్
TS EAMCET 2024 ప్రిపరేషన్ టిప్స్ TS EAMCET 2024 ఛాయిస్ ఫిల్లింగ్
TS EAMCET 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు TS EAMCET 2024 మాక్ టెస్ట్

TS EAMCET ద్వారా అడ్మిషన్ కోసం కోర్సులు జాబితా (List of Courses for Admission through TS EAMCET)

అభ్యర్థులు తమ అర్హత ప్రమాణాలతో పాటు TS EAMCET పరీక్ష ద్వారా అడ్మిషన్ తీసుకోగల కోర్సుల వివరాలను(List of Courses for Admission through TS EAMCET) క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

డిగ్రీ పేరు/కోర్సు

అర్హత ప్రమాణాలు

B.Tech

  • ఇంటర్  క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ క్వాలిఫైడ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • దరఖాస్తుదారులు +2 స్థాయిలో కనీసం 45% మార్కులు (రిజర్వ్ చేయబడిన వర్గానికి 40%) సాధించి  ఉండాలి

  • దరఖాస్తుదారులు అడ్మిషన్ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి కనీసం 16 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

  • ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీ విభాగంలో ఏదైనా ఒకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

B.Pharmacy

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం క్లాస్ XII అర్హత కలిగి ఉండాలి

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్థాయిలో చదివి ఉండాలి

  • దరఖాస్తుదారులు వారి సంబంధిత అర్హత పరీక్షలలో కనీసం 45% (SC/ST కోసం 40%) మార్కులు పొంది ఉండాలి

  • అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు దరఖాస్తుదారులు తప్పనిసరిగా 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి

D.Pharma

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం క్లాస్ XII అర్హత కలిగి ఉండాలి

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ/గణితం సబ్జెక్టులను క్వాలిఫైయింగ్ పరీక్ష స్థాయిలో తప్పనిసరిగా చదివి ఉండాలి

  • తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి ఫార్మసీలో డిప్లొమా హోల్డర్లు లేదా తత్సమానంగా గుర్తించబడిన ఏదైనా ఇతర పరీక్ష కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

  • దరఖాస్తుదారులు వారి సంబంధిత అర్హత పరీక్షలలో కనీసం 45% (SC/ST కోసం 40%) మార్కులు పొంది ఉండాలి

  • దరఖాస్తుదారులు అడ్మిషన్ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి కనీసం 17 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

B.Tech in Biotechnology

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం క్లాస్ XII అర్హత కలిగి ఉండాలి

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్థాయిలో చదివి ఉండాలి

  • దరఖాస్తుదారులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ప్రభుత్వం నిర్వహించిన గణితంలో బ్రిడ్జ్ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

B.Sc Agriculture

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం క్లాస్ XII అర్హత కలిగి ఉండాలి

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింది సబ్జెక్టుల్లో ఏదైనా మూడు అంశాలను తప్పనిసరిగా చదివి ఉండాలి - ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్/నేచురల్ సైన్సెస్, అగ్రికల్చర్ లేదా ఒకేషనల్ కోర్సు అగ్రికల్చర్లో అర్హత పరీక్ష స్థాయిలో

  • దరఖాస్తుదారులు అడ్మిషన్ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి కనీసం 17 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

డైరెక్ట్ అడ్మిషన్ కోసం ప్రసిద్ధ కళాశాలల జాబితా (List of Popular Colleges for Direct Admission)

ఈ సెక్షన్ లో, అభ్యర్థులు మా కామన్ అప్లికేషన్ ఫార్మ్ ద్వారా నేరుగా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగలిగే తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కళాశాలల జాబితాను క్రింద చూడవచ్చు.

డైరెక్ట్ అడ్మిషన్ కోసం తెలంగాణలోని టాప్ బి టెక్ కళాశాలలు

The ICFAI Foundation for Higher Education Hyderabad

KL University Hyderabad

GITAM (Deemed to be University) Hyderabad

Lords Institute of Engineering and Technology Hyderabad

St. Peter’s Engineering College Hyderabad

---

డైరెక్ట్ అడ్మిషన్ కోసం తెలంగాణలోని బి ఫార్మసీ కళాశాలలు

GITAM (Deemed to be University) Hyderabad

---

ఇవి కూడా చెక్ చేయండి - 60 రోజుల్లో TS EAMCET 2024 కు ప్రిపరేషన్ స్ట్రాటజీ

సంబంధిత లింకులు

TS EAMCET 2024లో 25,000 నుండి 50,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా TS EAMCET 2024 లో 50, 000 నుంచి 75,000 ర్యాంకును అంగీకరించే కాలేజీల జాబితా
TS Eamcet 2024 లో 75,000 నుంచి 1,00,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా TS EAMCET 2024లో 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ కోసం కళాశాలల జాబితా

TS EAMCET 2024లో మరిన్ని అప్‌డేట్‌లను పొందడానికి CollegeDekho ను చూస్తూ ఉండండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-eamcet-courses-eligibility-admission-process-college-list/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top