TS TET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి : డైరెక్ట్ లింక్, క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్

Guttikonda Sai

Updated On: June 12, 2024 01:15 pm IST

తెలంగాణ TET 2024 ఫలితాలు ఈరోజు అంటే జూన్ 12వ తేదీన విడుదల అయ్యాయి, సమయం మరియు డైరెక్ట్ లింక్ ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
TS TET ఫలితాలు , డైరెక్ట్ లింక్

TS TET Results 2024: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 మే 20వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకూ నిర్వహించబడింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ 03వ తేదీన విడుదల అయ్యింది. తెలంగాణ TET 2024 ఫలితాలు ఈరోజు అంటే జూన్ 12వ తేదీన అధికారులు విడుదల చేశారు. ఫలితాలు విడుదల సమయం, ఫలితాలు చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి

TS TET పేపర్ 1 టాపర్ల జాబితా TS TET పేపర్ 2 టాపర్ల జాబితా

తెలంగాణ TET 2024 ఫలితాలు విడుదల తేదీ, సమయం ( TS TET Results Release Date and Time)

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు జూన్ 12వ తేదీ విడుదల కానున్నాయి, విడుదల సమయంతో పాటుగా మరింత సమాచారం తెలుసుకోవడానికి క్రింది టేబుల్ చూడవచ్చు.

తెలంగాణ TET 2024 పరీక్ష తేదీ

20 మే నుండి 02 జూన్ వరకు

తెలంగాణ TET 2024 ఫలితాలు

12 జూన్ 2024

తెలంగాణ TET 2024 ఫలితాలు విడుదల సమయం

మధ్యాహ్నం 01 గంటలకు ( విడుదల అయ్యాయి)

తెలంగాణ TET 2024 ఫలితాలు డైరెక్ట్ లింక్ (TS TET 2024 Results Direct Link)

తెలంగాణ TET 2024 ఫలితాలు జూన్ 12వ తేదీన విడుదల అయ్యాయి , అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ TET 2024 ఫలితాలు డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడింది)

తెలంగాణ TET 2024 ఫలితాల ముఖ్యంశాలు ( TS TET Results Highlights)

తెలంగాణ TET 2024 ఫలితాల ముఖ్యంశాలు ఈ క్రింది టేబుల్ లో తెలుసుకోవచ్చు.
TS TET కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2,86,381
TS TET 2024 పేపర్ 1 హాజరైన అభ్యర్థులు 85,996
TS TET 2024 పేపర్ 1 ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 57,725
TS TET 2024 పేపర్ 2 హాజరైన అభ్యర్థులు 1,50,491
TS TET 2024 పేపర్ 2 ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 51,443

తెలంగాణ TET 2024 ఫలితాలు డౌన్లోడ్ చేయడం ఎలా? ( How To Download TS TET 2024 Results?)

తెలంగాణ TET 2024 పరీక్ష ఫలితాలు తెలుసుకోవాలి అనే అభ్యర్థులు ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి.

  • తెలంగాణ TET అధికారిక వెబ్సైటు కు వెళ్ళండి, లేదా ఈ ఆర్టికల్ లో పైన అందించిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు మీ జర్నల్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  • మీ వివరాలను అందించిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
  • మీ ఫలితాలను సేవ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

TS TET 2024 క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ తీసుకోవడం ఎలా? ( How To Get TS TET 2024 Qualifying Certificate)

తెలంగాణ TET 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే DSC పరీక్ష వ్రాయడానికి అర్హత సాధిస్తారు. DSC పరీక్ష వ్రాసిన అభ్యర్థులు తప్పనిసరిగా TS TET 2024 క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ అధికారుల చేత ధ్రువీకరణ చేపిస్తేనే వారికి ఉద్యోగం లభిస్తుంది. గతంలో TS TET 2024 క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ ను పోస్ట్ ద్వారా అభ్యర్థుల చిరునామా కు పంపేవారు, కానీ ఇప్పుడు ఎటువంటి మెమో అభ్యర్థుల చిరునామాకు పంపించడం లేదు. అభ్యర్థులు అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకున్న TS TET 2024 ర్యాంక్ కార్డు,  క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ గా వ్యవహరించబడుతుంది. కాబట్టి  TS TET 2024 ర్యాంక్ కార్డు ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిని భద్రంగా ఉంచుకోవలసిందిగా అభ్యర్థులకు సూచించడమైనది.

TS TET 2024 క్వాలిఫయింగ్ మార్కులు ( TS TET 2024 Qualifying Marks)

తెలంగాణ TET 2024 పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా మారుతూ ఉంటాయి. అభ్యర్థులు ఈ క్రింది పట్టిక ద్వారా TS TET 2024 ఉతీర్ణత మార్కులను తెలుసుకోవచ్చు.

కేటగిరీ

ఉత్తీర్ణత శాతం

ఉత్తీర్ణత మార్కులు

జనరల్

60%

90

BC

50%

75

SC/ST

40%

60

PH

40%

60

గమనిక : తెలంగాణ TET ఉత్తీర్ణత మార్కులు అంటే కేవలం అభ్యర్థి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన మార్కులు మాత్రమే, ఉతీర్ణత మార్కులు సాధించిన అందరికీ ర్యాంక్ లభించదు అని గమనించాలి.

TSTET 2024 పరీక్ష ముఖ్యాంశాలు (TSTET 2024 Exam Highlights)

TSTET 2024 ముఖ్యమైన ముఖ్యాంశాలు దిగువ టేబుల్లో పేర్కొనబడ్డాయి:

పరీక్ష పేరు

TSTET (తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష)

కండక్టింగ్ బాడీ

పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం

పరీక్ష మోడ్

ఆఫ్‌లైన్

పరీక్ష వ్యవధి

పేపర్ 1: 150 నిమిషాలు

పేపర్ 2: 150 నిమిషాలు

మొత్తం మార్కులు

పేపర్-1: 150 మార్కులు

పేపర్-2: 150 మార్కులు

మొత్తం ప్రశ్నలు

ప్రతి పేపర్‌లో 150 MCQలు

మార్కింగ్ స్కీం

ప్రతి సరైన సమాధానానికి +1

నెగెటివ్ మార్కింగ్ లేదు

పరీక్ష హెల్ప్‌డెస్క్ నం.

040-23120340

పరీక్ష వెబ్‌సైట్

http://tstet.cgg.gov.in/

చెల్లుబాటు

జీవింతాంతం

వెయిటేజీ

టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో 20% వెయిటేజీ


తెలంగాణ TET 2024 పరీక్ష గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-tet-results-release-date-and-time-link-qualifying-certificate/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!