TSPSC ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. TSPSC ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ (TSPSC Selection Process)ను ఇక్కడ తెలుసుకోవచ్చు.
TSPSC ఎంపిక విధానం (TSPSC Selection Process):
వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC) ద్వారా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి . TSPSC గ్రూప్ 1, TSPSC గ్రూప్ 2, TSPSC గ్రూప్ 3, TSPSC గ్రూప్ 4ల పరీక్షలను నిర్వహిస్తుంది. ఆయా కేటగిరీల ప్రకారం, ఉద్యోగ ఖాళీల ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు తమ అర్హతలు, అనుకూలత ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ పేజీలో TSPSC కి సంబంధించిన ఎంపిక ప్రక్రియ (TSPSC Selection Process) ఎలా జరుగుతుందో? పూర్తి సమాచారం అందజేయడం జరిగింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్, ఇతర సంబంధిత పోస్టులకు క్రమం తప్పకుండా పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ TSPSC గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పరీక్షలో వివిధ దశలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో సెలక్ట్ అవ్వాలి. ఉద్యోగ ఖాళీలను బట్టి అభ్యర్థుల ఎంపిక విధానం భిన్నంగా ఉంటుంది. మొదట అభ్యర్థులు ప్రిలిమ్స్ దశలో ఉత్తీర్ణులైతేనే మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించగలరు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన అభ్యర్థులను మొదట ట్రైనింగ్ ఇవ్వడం జరగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ పూర్తైన తర్వాత అభ్యర్థి వారి పోస్ట్‌కు పోస్ట్ చేయబడతారు.
TSPSC అంటే ఏమిటీ? (What is TSPSC ?)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అనేది తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులను నియమించేందుకు వార్షిక రాష్ట్రస్థాయి నియామక పరీక్షను నిర్వహించే రాష్ట్ర పరిపాలనా సంస్థ. TSPSC రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ రౌండ్‌లు మూడు దశలుగా ఉంటాయి. ఈ పోస్టుల్లో నియమితులవ్వడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని రౌండ్‌లలో ఉత్తీర్ణత సాధించాలి. TSPSC ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్-టైప్‌లో ఉంటుంది. TSPSC మెయిన్స్ పరీక్ష వివరణాత్మక-రకం పరీక్ష.
TSPSC నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ ( TSPSC Notification Direct Link )
TSPSC విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC పరీక్ష 2023 వివరాలు (TSPSC Exam 2023 Overview)
TSPSC గ్రూప్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో చూడండి.
విశేషాలు
వివరాలు
అధికారిక నోటిఫికేషన్ ప్రచురణ
తెలియాల్సి ఉంది
అప్లికేషన్ ఫార్మ్ మొదలయ్యే తేదీ
తెలియాల్సి ఉంది
అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్
తెలియాల్సి ఉంది
అడ్మిట్ కార్డు
తెలియాల్సి ఉంది
ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్
తెలియాల్సి ఉంది
ప్రిలిమ్స్ ఫలితాలు
తెలియాల్సి ఉంది
మెయిన్ ఎగ్జామ్
తెలియాల్సి ఉంది
మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు
తెలియాల్సి ఉంది
ఇంటర్వ్యూ
తెలియాల్సి ఉంది
తుది ఫలితం
తెలియాల్సి ఉంది
TSPSC 2023 పరీక్షా విధానం (TSPSC 2023: Exam Pattern)
TSPSC నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన సూచనల ప్రకారం అప్లికేషన్ పూరించాలి. TSPSC నోటిఫికేషన్‌లో పరీక్షకు అవసరమైన మొత్తం సంబంధిత సమాచారం ఉంటుంది. పరీక్షా విధానం ఈ దిగువున తెలిపిన విధానంలో ఉంటుంది.
TSPSC గ్రూప్ 1 పరీక్ష మూడు దశలు ప్రిలిమినరీ/స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ.
స్క్రీనింగ్ పరీక్షలో రెండు పేపర్లు ఒక్కొక్కటి 140 పాయింట్లు, ప్రధాన పరీక్షలో ఏడు 150 పాయింట్లు, ఇంటర్వ్యూలో 75 పాయింట్లు ఉంటాయి.
తెలుగు, ఇంగ్లీషు రెండింటిలో అందుబాటులో ఉన్న భాషా పత్రాలు మినహా, పరీక్షా పత్రం, సిలబస్ రెండు భాషలలో అందుబాటులో ఉంటాయి.
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (TSPSC Group 1 Prelims Exam Pattern)
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా విధానం దిగువున తెలిపిన విధంగా ఉంటుంది.
పేపర్
సబ్జెక్ట్స్
మొత్తం ప్రశ్నలు
మార్కులు
టైమ్
1
జనరల్ స్టడీ
120
120
120 నిమిషాలు
2
జనరల్ ఆప్టిట్యూడ్
120
120
120 నిమిషాలు
మొత్తం
మొత్తం
240
240
240
TSPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ విధానం (TSPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పాటర్న్)
TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరీశీలించవచ్చు.
1
ఇంగ్లీష్
150
180 నిమిషాలు
2
తెలుగు
150
180 నిమిషాలు
3
పేపర్ 1 జనరల్ ఎస్సై
150
180 నిమిషాలు
4
పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ
150
180 నిమిషాలు
5.
పేపర్ 3 రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం, నీతి,
150
180 నిమిషాలు
6.
పేపర్ 4 భారతదేశం, తెలంగాణ ఎకనామీ, అభివృద్ధి
150
180 నిమిషాలు
7
పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ
150
180 నిమిషాలు
TSPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (Exam Pattern for Group 2
Prelims)
TSPSC గ్రూప్ 2 పరీక్షా విధానం గురించి దిగువున టేబుల్లో అందజేశాం.
సబ్జెక్టులు
ప్రశ్నల సంఖ్య
మొత్తం మార్కులు
టైమ్
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలీటీ
150
150
రెండున్నర గంటలు
తెలంగాణ, ఇండియన్ కానిస్టిట్యూషన్ సోషల్, హిస్టరీ కల్చరల్
150
150
రెండున్నర గంటలు
ఎకానమీ, ప్లానింగ్
150
150
రెండున్నర గంటలు
TSPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా విధానం (Mains Exam Pattern for Group 2)
TSPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా విధానం గురించి దిగువున ఇచ్చిన టేబుల్‌ను పరిశీలించండి.
పేపర్
సబ్జెక్ట్
ప్రశ్నలు
మార్కులు
1
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ
150
150
2
తెలంగాణ సామాజిక చరిత్ర (తెలంగాణ లోని వివిధ సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర) భారత రాజ్యాంగం సాధారణ అవలోకనం
150
150
3
భారతదేశంలో ప్రణాళిక, భారత ఆర్థిక వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక సూచనతో గ్రామీణ సమాజంలో సమకాలీన సమస్యలు, అభివృద్ధి
150
150
TSPSC గ్రూప్ 3 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (Exam Pattern for Group 3 Prelims)
TSPSC గ్రూప్ 3 ప్రిలిమ్స్ పరీక్షా విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
పేపర్
సబ్జెక్ట్
ప్రశ్నలు
మార్కులు
సెక్షన్ ఏ
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ
75
75
సెక్షన్ బీ
రూరల్ డెవలప్‌మెంట్, గ్రామీణ ఏరియా సమస్యలు
75
75
TSPSC గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షా విధానం (TSPSC Group 3 Mains Exam Pattern)
పేపర్
సబ్జెక్ట్
ప్రశ్నలు
మార్కులు
పేపర్ 1
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ
150
150
పేపర్ 1
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ
150
150
TSPSC గ్రూప్ 4 ప్రిలిమ్స్ పరీక్షా విధానం (TSPSC Exam Pattern for Group 4 Prelims)
TSPSC గ్రూప్ 4 పరీక్షా విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
సబ్జెక్ట్
మార్కులు
సెక్షన్ ఏ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ
100/100
సెక్షన్ బీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు
50/50
TSPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షా విధానం (TSPSC Mains Exam Pattern for Group 4)
TSPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షా విధానం గురించి దిగువున అందజేయడం జరిగింది.
సబ్జెక్ట్
ప్రశ్నలు
మార్కులు
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలీటీ
150/150
150 నిమిషాలు
జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు
150/150
150 నిమిషాలు
మొత్తం
300
300
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కోసం, అప్‌డేట్స్ కోసం Collegedekhoని ఫాలో అవ్వండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?
0 Upvotes
0 Downvotes
/articles/tspsc-selection-process/
మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.
Approved by: Bar Council of India, AIU, NCTE, Pharmacy Council of India, NABL, IAP, UGC-AICTE-DEC ( Joint committee), ICAR, Indian Association of Physiotherapists, NCTE, ACU, UGC, ACBSP, NAAC, COA, National Assessment and Accreditation Council (NAAC), IAU, Punjab State Council For Agricultural Education (PSCAE), Institute Of Town Planners, ITPI
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి
TS EDCET 2024 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for TS EDCET 2023 Counselling)