టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023 సిలబస్, పరీక్షా విధానం (TSRJC CET 2023 Exam Pattern):
TSRJC CET 2023 సిలబస్ తెలంగాణ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TSREIS) ద్వారా విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ని జూనియర్ కాలేజీలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌లో విద్యార్థులకు ప్రవేశం కల్పించడానికి నిర్వహించబడుతుంది. ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అభ్యర్థులు సిలబస్‌ని, పరీక్షా విధానం గురించి చెక్ చేసుకోవాలి. అభ్యర్థులు ఇక్కడ TSRJC CET 2023 సిలబస్‌ని ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది TSRJC CET 2023 పరీక్ష మే 06, 2023న జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డుల క ోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్
tsrjdc.cgg.gov.inని
చూస్తుండాలి. TSRJC CET 2023 ప్రశ్నాపత్రంలో అన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీస్ మీడియంలో కూడా ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. TSRJC CET 2023 పరీక్షా విధానం గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం.
టీఎస్ఆర్‌జేసీ సెట్ సిలబస్ 2023 (TSRJC CET 2023 Exam Pattern)
తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్‌లో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలే క్వశ్చన్ పేపర్‌లో వస్తాయి.సబ్జెక్ట్ | సిలబస్‌లో వివరాలు |
---|---|
మ్యాథ్స్ |
పొలినామినల్ (Polynomial)
స్టేటస్టిక్స్ (Statistics) నిజమైన సంఖ్యలు (Real Number) అర్థమెటిక్ ప్రోగ్రెషన్ (Arthmetic Progression) |
ఫిజికల్ సైన్స్ |
వేడి, గతిశాస్త్రం
పరమాణు సంఖ్యలు ఆమ్లాలు మరియు బేస్ బేస్ మరియు లవణాలు పరమాణు ద్రవ్యరాశి అణువు యొక్క నిర్మాణం |
బయాలాజికల్ సైన్స్ |
పోషకాహారం
రవాణా ప్రసరణ వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ పునరుత్పత్తి వ్యవస్థ న్యూరాన్లు మరియు నియంత్రణ వ్యవస్థ |
సోషల్ స్టడీస్ |
అభివృద్ధి కోసం ఆలోచన
భారతదేశ వాతావరణం భారతీయ సంస్కృతి భారతదేశ వారసత్వం ఉపాధి మరియు నిరుద్యోగం తలసరి ఆదాయం |
ఇంగ్లీష్ |
ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్సియో (Reading Comprehension)
టెన్స్ లెటర్ రైటింగ్ గ్రామర్ పదజాలం ప్రత్యక్ష, పరోక్ష ప్రసంగం వాక్య సవరణ |
TSRJC CET పరీక్షా విధానం 2023 (TSRJC CET EXAM PATTERN 2023)
తెలంగాణ రెసిడెన్సియల్ కాలేజ్ ప్రవేశ పరీక్ష విధానం ఇతర ప్రవేశ పరీక్షల్లాగానే ఉంటుంది. ప్రశ్నాపత్రంలో మొత్తం మల్టిపుల్ ఛాయిస్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి.
- ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి
- పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు
- 150 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఒక్కో సెక్షన్‌కి 50 మార్కులు కేటాయించడం జరుగుతుంది.
- TSRJC CET 2023 ప్రశ్నా పత్రంలో పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
- పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది.
- ఎటువంటి నెగిటెవ్ మార్కింగ్ ఉండదు
పేపర్ గ్రూప్ (Paper Groups)
అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది పేపర్ల సమూహాలలో ఒకదానికి హాజరు కావాల్సి ఉంటుంది.కోడ్ | సబ్జెక్ట్స్ గ్రూప్ | మార్కులు |
---|---|---|
01 | ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ | 150 |
02 | ఇంగ్లీష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ | 150 |
03 | ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ | 150 |
టీఎస్ఆర్‌జేసీ 2023 ప్రిపరేషన్ టిప్స్ (TSRJC CET 2023 Preparation Tips)
TSRJC CET 2033 ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ దిగువున సూచించే విధంగా ప్రిపరేషన్ టిప్స్‌ని ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు.
- TSRJC CET 2033 పరీక్షకు కనీసం 2, 3 నెలల ముందు ప్రిపరేషన్ ప్రారంభించాలి తద్వారా చివరి నిమిషంలో ఇబ్బంది ఉండదు.
- టీఎస్ఆర్జేసీ 2023 పరీక్షకు కనీసం రెండు, మూడు నెలల ముందు ప్రిపరేషన్ ప్రారంభించాలి. తద్వారా చివరి నిమిషంలో ఇబ్బంది ఉండదు.
- అభ్యర్థులు తాము ఏ టాపిక్‌పై బాగా పట్టు ఉందో? ఏ అంశంలో వీక్‌గా ఉన్నారో దృష్టిలో ఉంచుకుని దానికనుగుణంగా టైమ్ టేబుల్‌ని రూపొందించుకోవాలి
- ప్రిపేర్ అయ్యే ముందు సిలబస్, పరీక్షా సరళి, పరీక్షకు సంబంధించిన ఇతర ముఖ్యమైన వివరాలను సరిగ్గా చెక్ చేసుకోవాలి.
- పుస్తకాలు, ప్రశ్న, నమూనా పత్రాలు వంటి అన్ని అధ్యయన సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి.
- మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం, నమూనా పత్రాలను వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయాలి.
- మీ బలహీనమైన పాయింట్లపై దృష్టి పెట్టి దానిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి.
- మ్యాథ్స్ పేపర్ గ్రూప్‌లో ఉన్నట్లయితే ప్రతిరోజూ గణిత సమ్మేళనాలను ప్రాక్టీస్ చేయాలి.
- రివిజన్ చేసుకునే సమయంలో సహాయపడగల చక్కటి వ్యవస్థీకృత నోట్స్‌ని రాసుకోవాలి.
- మంచి ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి.
- అదే సమయంలో మంచిగా నిద్రపోవాలి. మైండ్ ఫ్రెష్‌గా ఉండేలా బాగా నిద్రపోండి.
సిమిలర్ ఆర్టికల్స్
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ
JEE మెయిన్ 2025 అడ్మిట్ కార్డులో (JEE Main 2025 Admit Card) తప్పులని సరి చేసుకునే విధానం
JEE మెయిన్ 2025 రివిజన్ టిప్స్ (JEE Main 2025 Revision Tips) నోట్స్, ప్రిపరేషన్ ప్లాన్, మంచి స్ట్రాటజీ
JEE మెయిన్ 2024 హెల్ప్‌లైన్ నంబర్ (JEE Main 2024 Helpline Number) - కేంద్రం, ఫోన్ నంబర్, చిరునామా