![TSRJC CET ఫలితాలు 2024 ( TSRJC CET Results 2024) : విడుదల తేదీ మరియు సమయం, లింక్, కౌన్సెలింగ్ ప్రక్రియ](https://media.collegedekho.com/media/img/news/TSRJC_ఫలతల_వడదల_తద_సమయ_.png?height=310&width=615)
TSRJC CET ఫలితాలు 2024 ( TSRJC CET Results 2024) : TSRJC 2024 పరీక్ష ఈరోజు అంటే 21 ఏప్రిల్ తేదీన జరుగుతుంది.. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఉన్న దాదాపు 3000 సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం లో మొత్తం 35 TSRJC కళాశాలలు ఉన్నాయి. వీటిలో 20 బాలికల కళాశాలలు కాగా మిగతా 15 బాలుర కళాశాలలు. విద్యార్థులకు ఈ కళాశాలల్లో ఇంటర్మీడియట్ MPC, BiPC , MEC కోర్సులు అందుబాటులో ఉన్నాయి. TSRJC 2024 పరీక్ష ద్వారా ఈ కళాశాలలో అడ్మిషన్ సాధించిన విద్యార్థులకు విద్య మరియు వసతి ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. ఈరోజు పూర్తి అయిన TSRJC CET 2024 పరీక్ష ఫలితాలు మరో రెండు వారాలలో విడుదల కానున్నాయి.
TSRJC CET 2024 ఫలితాలు ముఖ్యమైన తేదీలు ( TSRJC CET 2024 Important Dates)
TSRJC CET 2024 ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
ఈవెంట్ | తేదీలు |
---|---|
TSRJC CET పరీక్ష | 21 ఏప్రిల్ 2024 |
TSRJC CET ఆన్సర్ కీ | 24 ఏప్రిల్ 2024 ( అంచనా) |
TSRJC CET ఫలితాలు | మే మొదటి వారం 2024 |
TSRJC CET కటాఫ్ విడుదల | మే మొదటి వారం 2024 |
TSRJC CET కౌన్సెలింగ్ | మే చివరి వారం 2024 |
TSRJC CET తరగతుల ప్రారంభం | జూన్ రెండవ వారం 2024 |
TSRJC CET కటాఫ్ 2024 ( TSRJC CET 2024 Cut Off )
10వ తరగతి తర్వాత విద్యార్థులకు ఉచితంగా విద్య మరియు వసతి అందించే కళాశాలలు కాబట్టి సాధారణంగా TSRJC కళాశాలల్లో అడ్మిషన్ కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే TSRJC CET 2024 కటాఫ్ కళాశాలను బట్టి , విద్యార్థుల జెండర్ ను బట్టి మరియు కేటగిరీ ను బట్టి మారుతూ ఉంటుంది. కళాశాలకు సంబంధించిన కటాఫ్ సాధించిన విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. అధికారులు TSRJC CET 2024 కటాఫ్ ను విడుదల చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది.
కేటగిరీ | TSRJC CET 2024 కటాఫ్ |
---|---|
జనరల్ | తెలియాల్సి ఉంది |
BC | తెలియాల్సి ఉంది |
SC / ST | తెలియాల్సి ఉంది |
TSRJC CET 2024 కౌన్సెలింగ్ ( TSRJC CET 2024 Counselling )
TSRJC CET 2024 ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థుల ర్యాంక్ ప్రకారంగా కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. ఈ కౌన్సెలింగ్ రెండు దశల్లో జరుగుతుంది, 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి TSRJC CET 2024 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్ లో పాల్గొనడానికి వీలవుతుంది. TSRJC CET 2024 కౌన్సెలింగ్ మే నెల చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నది. కౌన్సెలింగ్ లో పాల్గొనే విద్యార్థులు వారి సెర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేపించాలి, తర్వాత ఛాయిస్ ఫిల్లింగ్ ద్వారా వారికి కేటాయించిన తేదీలలో వెబ్ ఆప్షన్స్ పూరించాలి. తర్వాత విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలల్లో నిర్ణీత గడువు లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
TSRJC CET 2024 పరీక్ష గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
సీటెట్ పేపర్ 2 2024 వెయిటేజీ (CTET Paper 2 Weightage) ప్రశ్నల రకం, ప్రిపరేషన్ టిప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి
టీఎస్ ఐసెట్ 2024లో 35,000 కంటే ఎక్కువ ర్యాంక్‌ని (TS ICET 2024 Rank Wise Colleges) అంగీకరించే కాలేజీల జాబితా
AFCAT 2024 దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు - తేదీలు, ప్రక్రియ, ఎలా సవరించాలి
తెలంగాణ ఐసెట్ 2024 పరీక్ష రోజు పాటించాల్సిన సూచనలు (TS ICET 2024 Exam Day Instructions)
TS ICET 2024లో 5,000 నుంచి 10,000 ర్యాంక్‌లను అంగీకరించే కాలేజీల జాబితా (Best Colleges for TS ICET 5000 to 10000 Rankers)
జిల్లాల వారీగా APRJC కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య (District-Wise Total No. of Seats in APRJC Colleges 2024 )