మహిళా దినోత్సవం చరిత్ర, గొప్పతనం గురించి ఆర్టికల్ (women's day speech in telugu)

Andaluri Veni

Updated On: March 08, 2024 10:04 AM

మహిళా దినోత్సవం చరిత్ర, గొప్పతనం గురించి పూర్తి ప్రసంగం (women's day speech in telugu) ఇక్కడ అందజేశాం.  ఎంతో మంది చేసిన పోరాటాల ఫలితంగా మహిళలకు కొన్ని అవకాశాలను పొందగలుగుతున్నారు. 
మహిళా దినోత్సవం చరిత్ర, గొప్పతనం గురించి ఆర్టికల్  (women's day speech in telugu)

తెలుగులో మహిళా దినోత్సవం ప్రసంగం (Women's Day Speech in Telugu) : ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని (Women's Day Speech in Telugu) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఓ చరిత్రాత్మకమైన ఉద్యమమే మహిళా దినోత్సవానికి బాటలు వేసింది. తమ పనిగంటలను తగ్గించమని కోరుతూ మహిళలు చేపట్టిన ఉద్యమం.. దేశదేశాలకు వ్యాపించి పెద్ద ఎత్తున మహిళలు పోరాడారు. ఆ ఫలితంగానే 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. ఈ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, లింగ సమానత్వం వైపు దృష్టిని తీసుకురావడంలో సహాయపడుతుంది. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల వివక్షతపై అవగాహనను కలిగించడానికి తోడ్పడుతుంది. అంతేకాదు మహిళా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో మహిళల విలువ, ప్రాముఖ్యతను గుర్తించే రోజుగా కచ్చితంగా పరిగణించాలి.

100  పదాల్లో ఉమెన్స్ డే గురించి ప్రసంగం  (Women's Day Speech in 100 words)

ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళల స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, అణచివేతలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచే  అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టుకొచ్చింది. మహిళల అభివృద్ధి కోసం మనదేశంలో ఎంతో మంది మహిళామణులు పోరాటం చేశారు. నేడు సమాజంలో మహిళలు కొన్ని అవకాశాలనైనా అందిపుచ్చుకుంటున్నారంటే అది వారు వేసిన బాటలనే చెప్పాలి. అలాంటి వారిలో  సావిత్రీబాయి ఫూలే గురించి ముందుగా చెప్పుకోవాలి. దేశంలోనే అన్ని సామాజిక వర్గాల బాలికలకు విద్యనందించేందుకు 17 పాఠశాలలను స్థాపించిన తొలి మహిళా టీచర్.  కుల, లింగ వివక్షను అంతం చేయడానికి సావిత్రీ భాయి పూలే ఇతర మహిళలతో కలిసి పనిచేశారు. మహిళల కోసం పోరాడుతున్న ఆమెను ఎంతోమంది అవమానించారు. కానీ పట్టువదలకుండా మహిళల కోసం పోరాటం చేశారు.

సావిత్రీ బాయి పూలే మహారాష్ట్రకు చెందిన ఉపాధ్యాయురాలు, కవయిత్రి, సంఘ సంస్కర్త.  ఆమె భర్త జ్యోతిరావ్ ఫూలే 1848లో మహారాష్ట్రలోని పూణేలో భిడే వాడా సమీపంలో మొదటి ఆధునిక భారతీయ బాలికల పాఠశాలల్లో ఒకదాన్ని స్థాపించారు. ఎంతో మంది బాలికలకు చదువు చెప్పించారు. మహిళలకు విద్య ఎంత అవసరమో సమాజానికి తెలియజేశారు. కాగా ప్లేగు వ్యాధి కారణంగా సావిత్రీబాయి ఫూలే మార్చి 10, 1897న చనిపోయారు.

ఇవి కూడా చదవండి...
తెలుగులో రిపబ్లిక్ డే స్పీచ్ ఉపాధ్యాయ దినోత్సవం ప్రత్యేకత
తెలుగులో బాలల దినోత్సవం వ్యాసం క్రిస్మస్ వ్యాసం వ్రాయడం ఎలా?
సంక్రాంతి పండగ విశేషాలు, విద్యార్థుల కోసం

500 పదాల్లో మహిళా దినోత్సవంపై స్పీచ్ (Womens Day Speech in 500 words)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది  హక్కులు, సాధికారత, సమానత్వం కోసం మహిళలు చేసే పోరాటానికి సంకేతంగా చెప్పుకునే రోజు. ప్రతి ఏడాది మార్చి 8న మహిళల సమస్యలు చర్చకు వస్తుంటాయి. వారు సాధించిన విజయాలను చెప్పుకోవడం జరుగుతుంది.  ఆరోజున అన్ని రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలను సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది.

మార్చి 8నే ఉమెన్స్ డేను జరుపుకోవడానికి చాలా చరిత్ర ఉంది. 1908లో న్యూయార్క్ నగర వీధుల్లో తమ హక్కుల కోసం వేలాది మంది మహిళా కార్మికులు రోడ్ల మీదకు వచ్చి చేసిన పోరాటానికి గుర్తుగా మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. ముఖ్యంగా ఫ్యాక్టరీల్లో తమ పని గంటలను తగ్గించాలనే డిమాండ్‌తో 15 వేల మంది మహిళలు ఉద్యమించారు. ర్యాలీలు, ధర్నాలు చేశారు.  ఆ ఉద్యమానికి క్లారా జెట్కిన్ నేతృత్వం వహించారు. ఆ ఉద్యమం ఫలించి మహిళలకు కొన్ని హక్కులు ఏర్పడ్డాయి. మొట్టమొదటిగా 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఉమెన్స్ డేని జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తితో ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ప్రతి ఏడాది మార్చి 08న ఉమెన్స్ డే వేడుకలు జరుగుతున్నాయి.

ఇలా ఎంతోమంది చేసిన పోరాటాల ఫలితంగా అన్ని దేశాల్లో మహిళలకు కొన్ని హక్కులు దొరికాయి. ముఖ్యంగా మహిళలకు విద్య అందింది. మహిళలకు ఓటు హక్కు ఏర్పడింది. మహిళలు ఉద్యోగాలు చేసే అవకాశం ఏర్పడింది. దీంతోపాటు మనలాంటి దేశాల్లో పిల్లలకు చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసేయడం, సతిసహగమనం అంటే భర్తతోపాటు భార్యను చితిపై ఉంచి దహనం వంటి అనాగకరిక, మూఢనమ్మకాల నుంచి విముక్తి లభించింది.  వింతతు వివాహాలు పెరిగాయి. ఇలాంటి ఎన్నో రకాల బాధల నుంచి మహిళలు విముక్తి చెందారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు ఫలితంగా మహిళలపై జరిగే ఇలాంటి దారుణాలు ఆగాయి.

అయితే సమాజంలో నేటీకీ మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా  లింగ సమానత్వం అనేది కలగానే ఉంది. దీంతోపాటు లైంగిక వేధింపులు, అత్యాచారాలు, లైంగిక దోపిడీ, వరకట్నం వంటి సమస్యలను మహిళలను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది మహిళలు  ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం  తమ గొంతులను వినిపిస్తూనే ఉన్నారు. ఇళ్లలో మహిళలు చిన్నతనం నుంచే వివక్షకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు పుట్టడమే శాపంగా భావిస్తున్నారు. అమ్మాయిలకు చదువు చెప్పించడమే దండగనే భావం కూడా ఉంది. అంతేకాదు మహిళలకు ఇళ్లలో ఆంక్షలు విధిస్తున్నారు. పని కోసం ఇంటి నుంచి బయటకు రానివ్వని పరిస్థితి కూడా ఉంది.  ఒక రంగంలో మహిళలు రాణించేందుకు, నాయకత్వంలో స్థానం సంపాదించుకునేందుకు ఎంతో కృషి చేయాల్సి వస్తుంది.  మహిళా సాధికారిత, అభివృద్ధి అనేవి చెప్పుకున్నంత స్థాయిలో జరగడం లేదని, సొంత వాళ్ల చేతుల్లోనే మహిళలకు వేధింపులకు గురవుతున్నారని చాలా సర్వేలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు స్ఫూర్తిగా కొంతమంది మహిళలు తమ ఉనికి కోసం, హక్కుల కోసం పోరాడుతున్నారు.  ఎన్నో ఒడుదొడుకులు దాటుకుని తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుంటూ మరికొంతమంది మహిళలు తమ బలాలు, సామర్థ్యాలను గ్రహించడం ప్రారంభించారు. అడ్డంకులను దాటుకుని  ఇంటి నుంచి బయటకు అడుగులు వేస్తున్నారు. వారి ఇంటికే కాకుండా,  మొత్తం సమాజ విజయానికి దోహదం చేస్తున్నారు. మహిళలు ప్రపంచాన్ని తమవైపు తిప్పుకునేలా చేస్తున్నారు.  మహిళలు మగవాళ్లపై  ఆధారపడడానికి ఇష్టపడడం లేదు. తమ ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రతి అంశంలో స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంగా ఉంటున్నారు. పురుషులతో సమానంగా ప్రతిదీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నారు. వారి సొంత గుర్తింపుతో తమను గౌరవించాలనే వాదనను వినిపిస్తున్నారు.


తెలుగులో ఉమెన్స్ డే స్పీచ్  (Women's Day Speech in Telugu)


మహిళల సామాజిక స్థానాన్ని బట్టే ఆ సమాజం ప్రగతిని అంచనా వేయవచ్చని ప్రముఖ తత్త్వవేత్త కారల్ మార్క్స్ అన్నారు. మహిళలకు సమాన గౌరవం కల్పించి, పట్టించుకున్నప్పుడే ఆ సమాజం బాగుంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు కూడా మహిళల ప్రగతికి పెద్ద పీట వేస్తున్నారు. మహిళల చదువుకోసం, ఉద్యోగాల కోసం ప్రత్యేక అవకాశాలను కల్పిస్తోంది. మహిళల సంరక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకొస్తుంది. కానీ ఆ చట్టాలు అనుకున్నంత స్థాయిలో పని చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్ని చట్టాలున్నా మహిళలపై దాడులు ఆగడం లేదు. అంతేకాదు ఇప్పటికీ సమాజంలో మహిళలు రెండో తరగతి పౌరురాలిగానే ఉండాల్సి వస్తుంది. ఒక సాటి మనిషిగా ఆమెకు గౌరవం దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే  అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మహిళలు చేస్తున్న పోరాటాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిగా నిలుస్తుంది. 2017లో ప్రారంభమైన #MeToo ఉద్యమం, పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వేధింపుల విస్తృతమైన సమస్యను వెలుగులోకి తెచ్చింది. ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అలా ఎన్నో మహిళా పోరాటాలు ఉనికిలోకి వస్తున్నాయి.

200 పదాల్లో మహిళా దినోత్సవం స్పీచ్  ( Womens Day Speech in 200 words)


తమ ఎదుగుదల కోసం మహిళలు సమాజంలో ఉన్న కొన్ని అడ్డంకులను దాటాల్సి ఉంది.  లింగ సమానత్వం కోసం జరుగుతున్న పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి మహిళల సవాళ్లు, అడ్డంకులను పరిష్కరించడం చాలా కీలకం. ఈ సవాళ్లకు సంబంధించి ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి.
  • లింగ-ఆధారిత హింస: ప్రపంచవ్యాప్తంగా, మహిళలు లైంగిక వేధింపులు, గృహ హింస, వేధింపులు, అక్రమ రవాణాతో సహా వివిధ రకాల లింగ-ఆధారిత హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇటువంటి హింస మహిళలకు హాని కలిగించడమే కాకుండా భయం, చెరగని గాయాలను ఏర్పరుస్తున్నాయి.
  • వివక్షత : వివక్షాపూరిత పద్ధతులు, సాంస్కృతిక నిబంధనలు, పేదరికం వంటి కారణాల వల్ల మిలియన్ల మంది బాలికలు ఇప్పటికీ ఉన్నత-నాణ్యత గల విద్యను పొందలేకపోతున్నారు. పరిమిత విద్యావకాశాల వల్ల మహిళలకు అవసరమైన నైపుణ్యాలు, విజ్ఞానం, ఆర్థిక సాధికారత కలగడం లేదు.
  • వేతన వ్యత్యాసం, ఆర్థిక అసమానత: మహిళలు తమ మగవాళ్లతో పోలిస్తే వేతనాలు, ఉపాధి అవకాశాలలో తరచుగా అసమానతలను ఎదుర్కొంటున్నారు. అనేక వృత్తులు, వ్యాపారాలలో ఇప్పటికీ మహిళలకు ఇచ్చే వేతనాల్లో తేడా ఉంది. ఇది దైహిక పక్షపాతాలు, కెరీర్ పురోగతి, నాయకత్వ స్థానాలకు అసమాన ప్రాప్యతను ప్రతిబింబిస్తుంది.
  • నాయకత్వంలో తక్కువ ప్రాతినిధ్యం: రాజకీయాలు, వ్యాపారం, విద్యారంగం, ఇతర రంగాలలో నాయకత్వం, నిర్ణయం తీసుకునే స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగా ఉంది. నిర్మాణాత్మక అడ్డంకులు, అవ్యక్త పక్షపాతాలు, మూస పద్ధతులు మహిళల పురోగతికి ఆటంకం కలిగిస్తాయి.
  • పునరుత్పత్తి హక్కులు,ఆరోగ్య సంరక్షణ లేకపోవడం: కుటుంబ నియంత్రణ సేవలు, ప్రసూతి సంరక్షణ, పునరుత్పత్తి హక్కులతో సహా సమగ్ర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణకు చాలా మంది మహిళలకు ప్రాప్యత లేదు. పునరుత్పత్తి హక్కులపై పరిమితులు, సరిపోని ఆరోగ్య సంరక్షణ సేవలు మహిళల ఆరోగ్యం, స్వయంప్రతిపత్తి, శ్రేయస్సును దెబ్బతీస్తున్నాయి.
  • వివక్ష, మూస పద్ధతులు: వివక్షాపూరిత వైఖరి, మూస పద్ధతులు, సాంస్కృతిక నిబంధనలు లింగ అసమానతను శాశ్వతం చేసే ప్రమాదం ఉంది. వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధికి మహిళల అవకాశాలను పరిమితం చేస్తాయి. జెండర్, జాతీ, లైంగిక ధోరణి, ఇతర కారకాలపై ఆధారపడిన పక్షపాతాలు స్త్రీలను అణచివేయడానికి దోహదం చేస్తున్నాయి.
  • సవాళ్లు: ఏ దేశంలోనైనా బలహీన, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు అనేక రకాల వివక్ష, అణచివేతను ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ అణచివేత, అసమానతలను పరిష్కరించడం ఎంతైనా అవసరం ఉంది.
  • చట్టపరమైన, విధానపరమైన అంతరాలు: మహిళల హక్కులను తగినంతగా రక్షించడంలో, లింగ-ఆధారిత వివక్ష, హింసను పరిష్కరించడంలో చట్టపరమైన, విధాన ఫ్రేమ్‌వర్క్‌లు విఫలమవుతున్నాయి. చట్టాల్లో లొసుగులు, సరిపోని వనరులు లింగ అసమానత్వం మహిళల కాళ్లకు సంకెళ్లుగా మారుతున్నాయి.
సమాజంలో పిృత్వస్వామ్య భావజాలం బలంగా ఉండడంతో నేటికి సొంత ఇళ్లలోనే మహిళలు గుర్తింపు కోసం తంటాలు పడాల్సి వస్తుంది. తినడం దగ్గర నుంచి, కొత్త బట్టలు కొనుక్కోవడం వరకు సొంత అభిప్రాయాన్ని వెల్లడించలేని పరిస్థితి ఉంది. ఉద్యోగం చేసినా తన జీతంపై తనకు హక్కు లేని దురావస్థ కూడా ఉంది. బయట ఏ రంగంలో రాణించినా, ఏ ఉద్యోగంలో ఏ స్థానంలో ఉన్నా.. ఇంటి పని మాత్రం  ఆమెదే.., ఆమె కోసం ఇంటి పనులు వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఈ పని ఆడవాళ్లదే అనే భావన పూర్తిగా తొలగిపోవాల్సిన సమాజం వచ్చినప్పుడు కచ్చితంగా మహిళలు మరెన్నో రంగాల్లో విజయబావుటాను ఎగురవేస్తారు. ఇవి ఆడ పనులు, ఇవి మగ పనులు అనే భావన తొలగిపోయే రోజు కోసం మహిళలు పోరాడాల్సిందే.. !

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ ఆర్టికల్స్ కోసం College Dekho ని ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/womens-day-speech-in-telugu/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top