ఏఎం రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024 (A M Reddy Memorial Engineering College AP EAMCET 2024 Cutoff) :
ఏఎం రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET ఎక్స్‌పెక్టడ్ కటాఫ్ 2024 వివరాలను ఈ దిగువున అందించాం. ఏఎం రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం చాలామంది విద్యార్థులు ఆశపడుతుంటారు. అలాంటి అభ్యర్థుల కోసం ఇక్కడ ఆ కళాశాల ఏపీ ఎంసెట్ 2024 కటాఫ్ వివరాలను అంచనాగా అందించాం. అయితే వాస్తవ కటాఫ్ వివరాలను కౌన్సెలింగ్ సమయంలో కాలేజీ విడుదల చేస్తుందని అభ్యర్థులు గుర్తించాలి. ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అన్ని కేటగిరీలకు ఏపీ ఎంసెట్ ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ వివరాలను అందిస్తున్నాం.
ఏఎం రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ CSEలో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న జనరల్ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా 54529 నుంచి 140000 వరకు కటాఫ్ ర్యాంకులు సాధించాల్సి ఉంటుంది. ఇక SC, ST కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 147039 నుంచి 170618 ర్యాంకును పొందాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 140493 నుంచి 166971 వరకు కటాఫ్ ర్యాంకులను సాధించాల్సి ఉంటుంది.
AM REDDY ఇంజనీరింగ్ కాలేజ్ | కటాఫ్ వివరాలు |
---|---|
AM REDDY ఇంజనీరింగ్ కాలేజ్ (CIV) | 10,000 నుంచి 1,35,463 |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) | 54,000 నుంచి 1,70,000 |
CS | 1,24,000 నుంచి 1,70,000 |
కంప్యూటర్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్ (CSM) | 85,000 నుంచి 1,36,000 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) | 5700 నుంచి 1,72,000 |
AGR | 91,000 నుంచి 170649 |
AP EAMCET కళాశాలల వారీగా అంచనా కటాఫ్ 2024: