ఏపీ ఇంటర్ మార్కుల గణన 2023 (AP Inter Marks Calculation 2023): ఏపీ ఇంటర్ పరీక్షలు 2023 ముగిశాయి. మార్చ్ 15వ తేదీన ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీతో ముగిశాయి. ఏపీ ఇంటర్మీడియట్ 2023 పరీక్ష ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. గత సంవత్సరాల ట్రెండ్‌లను బట్టి మే నెలలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల కోసం అభ్యర్థులు AP BIEAP అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తుండాలి. అయితే ఏపీ ఇంటర్ మార్కులను ఎలా గణిస్తారనే (AP Inter Marks Calculation 2023) విషయం ఇక్కడ చూడండి. మొదటి, రెండో ఇంటర్మీడియట్ విద్యార్థులకు గ్రేడింగ్ విధానం ఒకే విధంగా ఉంటుంది. ఈ ఆర్టికల్లో ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.
AP ఇంటర్ మార్కులు ఎలా లెక్కించబడతాయి? (How are AP inter marks calculated?)
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒకే గ్రేడింగ్ విధానం ఉంటుంది. మొత్తం ఏడు గ్రేడ్‌లు ఇస్తారు. ఈ దిగువున ఇచ్చిన టేబుల్ ద్వారా BIEAP గ్రేడింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవచ్చు.గ్రేడ్‌లు | మార్కుల రేంజ్ | గ్రేడ్ పాయింట్స్ |
---|---|---|
A1 | 91-100 మార్కులు | 10 |
A2 | 81-90 మార్కులు | 9 |
B1 | 71-80 మార్కులు | 8 |
B2 | 61-70 మార్కులు | 7 |
C1 | 51-60 మార్కులు | 6 |
C2 | 41-50 మార్కులు | 5 |
D1 | 35-40 మార్కులు | 4 |
F | 00-34 మార్కులు | ఫెయిల్ |
35 కంటే తక్కువ మార్కులు వస్తే ఫెయిల్ (Fail if less than 35 marks)
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో 100 మార్కులకు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఏదైనా సబ్జెక్టులో 35 శాతం మార్కులు కూడా రాకపోతే ఫెయిల్ అయినట్టే. అయితే దివ్యాంగ విద్యార్థులకు బోర్డు కనీస ఉత్తీర్ణత మార్కులను 35 శాతానికి బదులుగా 25 శాతంగా నిర్ణయించింది.మార్కుల సిస్టమ్ వల్ల విద్యార్థులపై ఒత్తిడి అధికంగా ఉంటుందనే ఉద్దేశంతో ్ విద్యాశాఖ గ్రేడింగ్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చింది. చాలా సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్‌లో గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. విద్యార్థుల మార్కుల లెక్కింపు గ్రేడింగ్ విధానానికి అనుగుణంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఫలితాల కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తుండాలి.
తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయాలి.