తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు రోజు వారీ జీవనాన్నిఅస్తవ్యస్తం చేస్తున్నాయి.రోజూ పడుతున్న వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వరదల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఫలితంగా, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు సెప్టెంబర్ 9వ తేదీన కూడా క్లోజ్ చేయబడ్డాయి. భారీ వరదలు, ఉరుములు, బలమైన గాలులను తీసుకువచ్చే వర్షాలు చాలా రోజుల పాటు కొనసాగుతాయని IMD అంచనా వేసింది. వర్షాల కారణంగా ఇప్పటికే మూడు, నాలుగు రోజులు పాటు పాఠశాలలకు సెలవులు వచ్చాయి.
అయితే విశాఖ పట్నంలో వర్షాలు తగ్గముఖం పట్టాయి. మరికొన్ని జిల్లాలో కూడా వర్షాలు తగ్గి.. ఎండ వచ్చిన సందర్భం ఉంది. ఇతర జిల్లాల్లో వర్షాలు పడుతాయా? లేదా? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11న పాఠశాలలకు సెలవులు ఉంటుందా? లేదా? అనేది విద్యార్థుల తల్లిదండ్రులు అనుకుంటున్నారు.
ఇది కూడా చదవండి :
ఈరోజు పాఠశాలలకు సెలవు, ఏ జిల్లాలో అంటే?
ఇది కూడా చదవండి:
రేపు హైదరాబాద్‌లో పాఠశాలలకు సెలవు ఉంటుందా? త్వరలో ఆదేశాలు
కా ఇప్పటి వరకు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత వాతావరణ విధ్వంసం కారణంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలోకి వెళ్లలేని పరిస్థితి, పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో తరగతులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఉత్తర కోస్తా ప్రాంతం, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతాలకు IMD ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
వర్షాలు, వరదల ప్రభావిత జిల్లాలు (Andhra Pradesh School Holiday 4 September: Affected Districts)
కొన్ని స్థానిక రిపోర్టుల ప్రకారం కొన్ని జిల్లాలో స్థానిక నదులు చాలా పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా ఈ దిగువున తెలిపిన జిల్లాలో
- విజయవాడ
- భవానీపురం
- అజిత్ సింగ్ నగర్
- రాజీవ్ నగర్
- పాయకాపురం
- శ్రీకాకుళం
- పార్వతీపురం మన్యం
- విజయనగరం
- విశాఖపట్నం
- శ్రీ అల్లూరి సీతారామరాజు
- అనకాపల్లి
- కాకినాడ
- తూర్పు గోదావరి
- యానాం
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ
- ఏలూరు
- పశ్చిమ గోదావరి
కాగా పాఠశాల సెలవు ప్రకటనపై తాజా అప్‌డేట్‌ల కోసం విద్యార్థులు తప్పనిసరిగా వెయిట్ చేయాలి. అధికారులు సెలవు ప్రకటిస్తే, విద్యార్థులు సురక్షితంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.