AP AGRICET ర్యాంకు కార్డు 2024 (AP AGRICET Rank Card 2024) :
ఆంధ్రప్రదేశ్‌లో NG రంగా వర్సిటీ అగ్రికల్చర్ BSC ప్రవేశాల కోసం నిర్వహించిన అగ్రిసెట్ 2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 1556 మంది హాజరుకాగా, 1447 మంది పాస్ అయ్యారు. ఈ పరీక్షల్లో హాజరైన విద్యార్థుల కోసం ర్యాంకు కార్డులు ఈరోజు అంటే అక్టోబర్ 11 నుంచి వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అభ్యర్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్, దరఖాస్తు వివరాలకు https://angrau.ac.in/ని చూడాలి.
అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆగస్టు 27న ఆన్‌లైన్‌లో నిర్వహించిన అగ్రిసెట్-2024 పరీక్షకు 1556 మంది హాజరయ్యారు. వీరిలో 897మంది అమ్మాయిలు, 659 మంది అబ్బాయిలు ఉన్నారు. పరీక్షకు హాజరైన వారిలో 1,469 మంది వ్యవసాయ డిప్లొమా, 35మంది సేంద్రీయ వ్యవసాయం, 52 మంది విత్తన సాంకేతిక పరిజ్ఞానం విభాగాల్లో పరీక్షలు రాశారు. అగ్రిసెట్ 2024లో మొత్తం 1,447మంది అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 93.0 శాతం ఉత్తీర్ణత సాధించారని రిజిస్ట్రార్ రామచంద్రరావు ప్రకటించారు. అగ్రిసెట్ ఫలితాలు శుక్రవారం నుంచి వర్శిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ర్యాంక్ కార్డులను వర్శిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. కౌన్సెలింగ్ తేదీల వివరాలను వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవాలి.
AGRICET 2024 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? (How to Check AGRICET 2024 Result?)
AGRICET 2024 ఫలితాలని చెక్ చేయడానికి చర్యలు అవసరం. ఇక్కడ సులభమైన గైడ్‌ని అందించడం జరిగింది.స్టెప్ 1: అభ్యర్థులు https://angrau.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
స్టెప్ 2: హోంపేజీలో AGRICET 2020 ఫలితం PDFపై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ పేరు, వివరాలు రాసి ఎంటర్ క్లిక్ చేయాలి.
స్టెప్ 4: అనంతరం PDF జాబితాలో మీ పేరు హైలైట్ అవుతుంది.
స్టెప్ 5 : ఇక్కడ నుంచి అభ్యర్థులు అతను/ఆమె పొందిన మార్కులను చెక్ చేయవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయాలి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ తెలుసుకోండి.