AP AGRICET అప్లికేషన్ ఫార్మ్ 2023 (AP AGRICET 2023 Application Form): ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU) AP AGRICET 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 5, 2023. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కెరీర్‌ను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు AP AGRICET 2023 పరీక్ష కోసం తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అయి ఉంది. ఈ పేజీలో కూడా ఆ లింక్‌ని అందజేయడం జరిగింది. చివరి తేదీ పూర్తయ్యేలోపు AP AGRICET పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి పూర్తి ప్రక్రియ, సూచనలను ఇక్కడ తెలుసుకోండి.
AP AGRICET అప్లికేషన్ ఫార్మ్ 2023 లింక్ (AP AGRICET 2023 Application Form)
ఏపీ అగ్రిసెట్‌కు అప్లై చేసుకోవడానికి డైరక్ట్ లింక్ జూలై 20, 2023 నుంచి యాక్టివ్‌గా ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 05, 2023లోపు దరఖాస్తు చేసుకోవాలి. అయితే అభ్యర్థులు చివరి తేదీ ఆగస్ట్ 10, 2023 వరకు ముగిసిన తర్వాత కానీ ఆలస్య రుసుముతో నమోదు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోని angrauagricet.aptonline.in ప్రధాన అప్లికేషన్ ఫార్మ్ పేజీకి దారి మళ్లించే డైరెక్ట్ లింక్‌ని ఈ దిగువున అందజేశాం.
AP AGRICET 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి సూచనలు (Instructions to Apply AP AGRICET 2023 Online)
అభ్యర్థులు చివరి తేదీ పూర్తి కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్ AGRICET 2023 ఫార్మ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఈదిగువ పేర్కొన్న సూచనలను అనుసరించాలి -
అప్లికేషన్ ఫార్మ్ లింక్ AP AGRICET అధికారిక వెబ్‌సైట్‌లో angrauagricet.aptonline.inలో భాగస్వామ్యం చేయబడింది.
హోంపేజీలో 'అప్లికేషన్ ఫీజు చెల్లించండి' ఆప్షన్‌ను ఎంచుకోండి.
అడిగిన ప్రాథమిక వివరాలను పూరించాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, UPI లేదా నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా చెల్లింపు చేయడానికి కొనసాగండి.
చెల్లింపు విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత, చెల్లింపు సూచన సంఖ్యను గమనించండి. హోంపేజీని మళ్లీ సందర్శించండి.
'ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ ' ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీ చెల్లింపు వివరాలను ఎంటర్ చేసి, 'ప్రొసీడ్'పై క్లిక్ చేయండి.
పూర్తి అప్లికేషన్ ఫార్మ్ పూరించండి. సంబంధిత పత్రం, ఫోటోలను అప్‌లోడ్ చేయండి.
మీ అప్లికేషన్ ఫార్మ్‌ని సమర్పించండి, సూచన కోసం దానిని సేవ్ చేయండి.