ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024 (AP DME Recruitment 2024) :
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివిధ స్పెషాలిటీలలో 1289 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన (AP DME Recruitment 2024)ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/MCh/DM) పొంది ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలు స్థానిక అభ్యర్థులకు ఓపెన్ చేసి ఉంటాయి. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే స్థానికేతర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు బ్రాడ్ స్పెషాలిటీకి నెలవారీ వేతనం రూ. 80,500, సూపర్ స్పెషాలిటీ కోసం రూ. 97,750. 08/01/2025 లోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. OC అభ్యర్థులకు ఫీజు రూ. 2000లు, BC/SC/ST అభ్యర్థులకు రూ. 1000లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, ఇతర వివరాలు ఇక్కడ అందించాం.
ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024 మొత్తం పోస్టులు (AP DME Recruitment 2024 Total Number of Posts)
ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024కు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.సీనియర్ రెసిడెంట్ (క్లినికల్)పోస్టులు | 603 |
---|---|
సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్) పోస్టులు | 590 |
సీనియర్ రెసిడెంట్ (సూపర్ స్పెషాలిటీ) పోస్టులు | 96 |
మొత్తం పోస్టుల సంఖ్య | 1,289 |
ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ (AP DME Recruitment 2024 Educational Qualification)
ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషాలిటీలో MD/MS/MCh/DM డిగ్రీని పొంది ఉండాలి.
- ప్రత్యామ్నాయంగా కనీసం 500 పడకలు ఉన్న గుర్తింపు పొందిన వైద్య సంస్థ నుండి బ్రాడ్ స్పెషాలిటీలలో DNB ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు.
- నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 44 ఏళ్లు మించకూడదు.
- ఆంధ్రప్రదేశ్ (AP)లో కనీసం 4 నుంచి 10 వ తరగతి చదివిన అభ్యర్థులు స్థానిక అభ్యర్థులుగా అర్హులు. మీరు తెలంగాణలో చదువుకుని, విభజన తర్వాత ఏపీకి వలస వచ్చినట్లయితే మీ స్థానిక స్థితిని నిరూపించుకోవడానికి మీకు రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్ అవసరం.
- ఈ ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులు మంచి జీతం ఉంటుంది. నెలకు రూ. 80,500 నుంచి రూ. 97,750ల వరకు జీతం ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ పోస్ట్ పదవీకాలం ఒక సంవత్సరం. ఇది పూర్తి చేయడం తప్పనిసరి. పనితీరు ఆధారంగా పదవీకాలం పొడిగింపు అందించబడవచ్చు.