ఏపీలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ (AP Mega DSC Notification 2024)
: ఏపీలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ (AP Mega DSC Notification 2024) త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నవంబర్ మొదటివారంలోనే ప్రకటించే అవకాశం ఉంది. దీనికోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో భాంగా 6,371 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 7,725 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు, 1,781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 286 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, 52 ప్రిన్సిపాళ్లు, 132 వ్యాయామ ఉపాధ్యాయులు భర్తీ చేయనున్నారు.
ఇటీవల ముగిసిన టెట్ ఫలితాలు నవంబర్ 2న రిలీజ్ అవుతాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ విడుదలయ్యాయి. ఇప్పటికే అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన అన్ని పరీక్షల క్వశ్చర్ పేపర్లు, ప్రిలిమినరీ కీలను పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. పేపర్ 2A సోషల్ పరీక్ష ప్రిలిమినరీ కీలపై అభ్యంతరాలను అక్టోబర్ 25 తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాల్సి ఉంది.
ఈ టెట్ పరీక్షకు 4 లక్షల 27 వేల మంది దరఖాస్తు చేయగా అందులో 3 లక్షల 68 వేల 661 మంది హాజరయ్యారు. 17 రోజుల పాటు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ 27న ఫైనల్ కీ విడుదల, నవంబర్ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది.
AP DSC 2024 ముఖ్యమైన తేదీలు (AP DSC 2024 Important Dates)
ఆంధ్రప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (AP DSC) AP DSC 2024 రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌తో పాటు వివరణాత్మక నోటిఫికేషన్ PDFని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ (AP DSC) షెడ్యూల్ విడుదల చేసినప్పుడు, అదేవిధంగా ఉంటుంది. ఈ ఆర్టికల్లో కూడా అప్‌డేట్ చేయబడుతుంది.
AP DSC మెగా నోటిఫికేషన్ 2024 | ముఖ్యమైన తేదీలు |
---|---|
AP DSC అధికారిక నోటిఫికేషన్ విడుదల తేదీ | అతి త్వరలో |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభ తేదీ | తెలియజేయబడుతుంది |
దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | తెలియజేయబడుతుంది |
ఫీజు పేమంట్ చివరి తేదీ | తెలియజేయబడుతుంది |
AP DSC హాల్ టికెట్ 2024 | తెలియజేయబడుతుంది |
AP DSC ఎగ్జామ్ డేట్ 2024 | తెలియజేయబడుతుంది |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలను పొందండి.