AP DSC నోటిఫికేషన్ 2024 లేటెస్ట్ న్యూస్ (AP DSC Notification 2024 Latest News Today in Telugu) :
ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది మెగా డీఎస్సీ 2024 కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్‌పై (AP DSC Notification 2024 Latest News Today in Telugu) ఎలాంటి ప్రకటన రిలీజ్ కాలేదు. దీంతో అభ్యర్థులు దీనిపై ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ దిగువున అందించాం.
మెగా డీఎస్సీలో వీలైనంత ఎక్కువ మందికి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్ నిర్వహించి, నవంబర్ తొలివారంలోనే ఫలితాలు కూడా విడుదల చేసింది. ఫలితాలు వెల్లడించిన మరుసటి రోజే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించినప్పటికీ రిలీజ్ కాలేదు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం?
ఏపీ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. కానీ నోటిఫికేషన్ రిలీజ్‌కి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు నేపథ్యంలో DSC నుంచే దానిని అమలు చేయాలని వచ్చిన అభ్యర్థునల ేరకు నోటిఫికేషన్‌కు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వంఅయితే.. తాజా పరిణామాలను చూస్తుంటే.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో డీఎస్సీ నుంచే దానిని అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు నోటిఫికేషన్‌ను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు ఆదేశించింది. దీంతో నివేదిక వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎస్సీ వర్గీకరణను ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం కమిషన్‌ని నియమించి, రెండు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది.
AP DSC ఖాళీలు 2024 (AP DSC Vacancy 2024)
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్లు, SGT, TGT, PET, PGT, ప్రిన్సిపల్ పోస్టుల కోసం 16,347 ఉపాధ్యాయుల ఖాళీల కోసం అభ్యర్థులను నియమించడానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ బాధ్యత వహించింది. వీటిలో 7725 ఖాళీలు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు ఉన్నాయి. పోస్ట్-వైజ్ AP DSC ఖాళీ 2024 కింది టేబుల్లో చేయబడింది.పోస్టులు | ఖాళీలు |
---|---|
స్కూలు అసిస్టెంట్లు | 7725 |
SGT | 6371 |
TGT | 1781 |
PGT | 286 |
PET | 132 |
ప్రిన్సిపాల్స్ | 52 |
మొత్తం | 16347 |