AP DSC నోటిఫికేషన్ 2024 PDF డౌన్‌లోడ్ (AP DSC Notification 2024 PDF Download) : ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2024 ప్రకటన ఈరోజు అంటే నవంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ వాయిదా పడింది. అయితే మరో నాలుగైదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in లో AP DSC నోటిఫికేషన్‌ని చెక్ చేయవచ్చు. ప్రకటిన విడుదలైన తర్వాత డిసెంబర్ 6వ తేదీ వరకు అంటే నెలరోజుల పాటు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి.
AP DSC 2024 నోటిఫికేషన్ PDF (AP DSC Notification 2024 PDF Download)
AP DSC 2024 నోటిఫికేషన్ PDF |
---|
AP DSC పరీక్ష నోటిఫికేషన్‌ను ఎలా చెక్ చేయాలి? (How to Check AP DSC Exam Notification)
AP DSC నోటిఫికేషన్‌ని ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇక్కడ అందించాం.- ముందుగా అభ్యర్థులు apdsc.apcfss.in కి వెళ్లాలి.
- హోంపేజీలో ఇచ్చిన DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి.
- PDFని డౌన్‌లోడ్ చేసుకుని, ఖాళీలు, పరీక్ష తేదీలు, ఇతర వివరాలను చెక్ చేయాలి.
రిపోర్టుల ప్రకారం 16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో 6,371 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), 7,725 మంది స్కూల్ అసిస్టెంట్లు (SA), 1,781 మంది శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్లు (TGTలు), 286 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGTలు), 52 మంది ప్రధానోపాధ్యాయులు, 132 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PETలు) ఉన్నారు. అభ్యర్థులు ఖాళీల సంఖ్య, రిజిస్ట్రేషన్ తేదీలు, అర్హత, దరఖాస్తు ప్రక్రియ మరియు ఎంపిక ప్రమాణాల గురించి నిర్ధారణ కోసం అధికారిక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి.
APTET జూలై పరీక్ష ఫలితాలు నవంబర్ 4న ప్రకటించబడ్డాయి. ఈసారి 368661 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాలి. వారిలో 187256 మంది అంటే 50.79 శాతం మంది అభ్యర్థులు పాస్ అయ్యారు. AP DSC నోటిఫికేషన్ apdsc.apcfss.inలో విడుదలవుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.