AP DSC నోటిఫికేషన్ విడుదల తేదీ 2024 : AP DSC 2024 నోటిఫికేషన్ నవంబర్ 06, 2024 తేదీన విడుదల కానున్నది, ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వగానే అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. AP DSC 2024 పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్, పోస్టులను భర్తీ చేయనున్నారు. AP DSC నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జూన్ 13వ తేదీన AP DSC విడుదల చేస్తున్నట్లు అధికారికంగా సంతకం చేశారు, AP DSC ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు.
AP DSC నోటిఫికేషన్ విడుదల తేదీ & పరీక్ష తేదీలు 2024 ( AP DSC Notification Release Date & Exam Dates 2024 )
AP DSC 2024 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.ఏపీ డీఎస్సీ 2024 ఈవెంట్లు | ఏపీ డీఎస్సీ 2024 ముఖ్యమైన తేదీలు |
---|---|
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ | నవంబర్ 6, 2024 |
AP DSC 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం | నవంబర్ 6, 2024 |
AP DSC 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
రెండు సెషన్లలో AP DSC 2024 పరీక్షలు | ఫిబ్రవరి 03 నుండి మార్చి 04, 2025 వరకు |
ఏపీ డీఎస్సీ 2024 హాల్ టికెట్లు | జనవరి 2025 |
AP DSC 2024 ఫైనల్ కీ విడుదల | తెలియాల్సి ఉంది |
AP DSC 2024 ఫలితాలు | తెలియాల్సి ఉంది |
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024)
AP DSC 2024 నోటిఫికేషన్ నవంబర్ 06 వ తేదీన విడుదల కానున్నది, ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీ కూడా అధిక సంఖ్యలో ఉంటుంది, కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రారంభించాలి. పోస్టుల ప్రకారంగా AP DSC ఖాళీల జాబితా 2024 ను క్రింది పట్టికలో గమనించవచ్చు.
పోస్టు | ఖాళీల సంఖ్య |
---|---|
AP DSC సెకండరీ గ్రేడ్ టీచర్ | 6371 |
AP DSC స్కూల్ అసిస్టెంట్ | 7725 |
AP DSC PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ) | 286 |
AP DSC TGT ( ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ) | 1781 |
ప్రిన్సిపల్ | 52 |
మొత్తం | 16347 |