AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) పరీక్షలు అక్టోబర్ నెలలో పూర్తి అవుతాయి, దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP DSC అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. AP TET 2024 పరీక్ష ఫలితాలు వచ్చిన 90 రోజుల తర్వాత AP DSC పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం కనీసం 90 రోజులు గడువు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే AP DSC 2024 పరీక్ష ద్వారా 16347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా TGT, PGT, SA, SGT మొదలైన పోస్టులను భర్తీ చేయనున్నారు. AP DSC 2024 అధికారిక నోటిఫికేషన్ నవంబర్ 3, 2024 తేదీన విడుదల చేయనున్నారు . AP DSC 2024 నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు .
AP DSC 2024 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు ( AP DSC 2024 Importanat Dates)
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష తేదీలు మొదలైనవి క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు .వివరాలు | తేదీలు |
---|---|
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల | నవంబర్ 3, 2024 |
AP DSC 2024 అప్లికేషన్ ప్రారంభం | నవంబర్ 2024 |
AP DSC 2024 అప్లికేషన్ ముగింపు | డిసెంబర్ మొదటి వారం 2024 |
AP DSC 2024 హాల్ టికెట్ విడుదల | డిసెంబర్ చివరి వారం 2024 |
AP DSC 2024 పరీక్షలు ప్రారంభం | జనవరి , 2025 |
AP DSC 2024 ఫలితాలు విడుదల | తెలియాల్సి ఉంది |
AP DSC 2024 డాక్యుమెంట్ వెరిఫికేషన్ | తెలియాల్సి ఉంది |