ఏపీ ఎంసెట్ బైపీసీ ఫేజ్ 1 కౌన్సెలింగ్ డేట్స్ 2024 (AP EAMCET BiPC Phase 1 Counselling Dates 2024): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) AP EAMCET BiPC 2024 కోసం ఫేజ్ 1 కౌన్సెలింగ్ తేదీలను (AP EAMCET BiPC Phase 1 Counselling Dates 2024) రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 30, 2024న మొదలవుతుంది. AP EAPCET-2024Bi.PC స్ట్రీమ్ అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.inని సందర్శించడం ద్వారా రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయవచ్చు. అభ్యర్థులు గడువు తేదీకి ముందే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. నోటిఫికేషన్ ప్రకారం AP EAMCET BiPC ఫేజ్ 1 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ డిసెంబర్ 5, 2024.పూర్తి వివరాలు ఈ దిగువున అందించాం.
ఏపీ ఎంసెట్ బైపీసీ ఫేజ్ 1 కౌన్సెలింగ్ తేదీలు 2024 (AP EAMCET BiPC Phase 1 Counselling Dates 2024)
అభ్యర్థులు ఈ దిగువ పట్టికలో BiPC కోసం AP EAMCET కౌన్సెలింగ్ తేదీలు 2024ని చెక్ చేయవచ్చు.ఈవెంట్స్ | వివరాలు |
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ | నవంబర్ 30, 2024 - డిసెంబర్ 5, 2024 |
అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఆన్‌లైన్ వెరిఫికేషన్ | డిసెంబర్ 2, 2024 -డిసెంబర్ 6, 2024 |
వెబ్ ఆప్షన్ల రిజిస్ట్రేషన్ | డిసెంబర్ 3, 2024 -డిసెంబర్ 7, 2024 |
వెబ్ ఆప్షన్ల సవరణ | డిసెంబర్ 8, 2024 |
సీట్ల కేటాయింపు ఫలితం | డిసెంబర్ 11, 2024 |
అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ కౌన్సెలింగ్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ.1200/- (OC/BC కోసం), రూ. 600/- (SC/ST కోసం). క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని అభ్యర్థులు సూచించబడ్డారు.
AP EAMCET BiPC ఫేజ్ 1 నమోదు చేసుకునే విధానం (Steps for AP EAMCET BiPC Phase 1 Registration)
AP EAMCET BiPC ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందించాం.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను eapcet-sche.aptonline.in సందర్శించాలి.
- AP EAMCET BiPC ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ చేయడానికి EAPCET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- అన్ని వివరాలను నమోదు చేసి ధ్రువీకరించాలి.
- కేటగిరీ ప్రకారం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
- ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రసీదుని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోవాలి.
- AP EAMCET BiPC ఫేజ్ 1 నమోదును పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు అన్ని విద్య, వ్యక్తిగత డాక్యుమెంట్లతో ధ్రువీకరణ దశకు వెళ్తారు.