AP EAMCET కౌన్సెలింగ్ నమోదు 2023 (AP EAMCET Counselling Registration 2023): AP EAMCET కౌన్సెలింగ్ 2023 కోసం (AP EAMCET Counselling Registration 2023) రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరిగా తేదీ ఆగస్టు 3, 2023. అదే విధంగా జూలై 25 నుంచి ఆగస్ట్ 4, 2023 లోపు అభ్యర్థులు తమ సర్టిఫికెట్‌లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెషన్ కోసం మీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేశారని నిర్ధారించుకోండి. మీ సంబంధిత AP EAMCET కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. అధికారుల నుంచి ప్రకటనల కోసం వేచి ఉండండి. మీ ర్యాంక్ ప్రకటించిన తర్వాత ఎంట్రన్స్‌లో మీ ర్యాంక్ కార్డ్‌ను సబ్మిట్ చేసి, కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో మీ AP EAMCET 2023 హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ వంటి అవసరమైన వివరాలని పూరించాలి. తదుపరి ప్రకటన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవబడతారు. మీరు పరీక్షలో సాధించిన ర్యాంకింగ్‌పై ధ్రువీకరణ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని గుర్తించుకోవాలి.
Click Here to Access the Direct Link to Re-upload Certificates
AP EAPCET 2023 కౌన్సెలింగ్ కోసం సర్టిఫికెట్‌లను మళ్లీ అప్‌లోడ్ చేయడానికి స్టెప్స్ (Steps to Re-Upload Certificates for AP EAPCET 2023 Counseling)
AP EAMCET కౌన్సెలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్‌లను మళ్లీ అప్‌లోడ్ చేయడానికి అనుసరించాల్సిన స్టెప్స్ ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
- పైన అందించిన లింక్‌పై క్లిక్ చేయండి లేదా మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
- హోంపేజీలో సర్టిఫికెట్ రీ-అప్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
- మీరు AP EAMCET 2023 అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- మీరు మీ డాష్‌బోర్డ్‌కి దారి మళ్లించబడతారు, అవసరమైన సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయండి.
- Submitపై క్లిక్ చేయండి.
AP EAMCET కౌన్సెలింగ్ 2023 కోసం అవసరమైన సర్టిఫికెట్లు (Required Certificates for AP EAMCET Counseling 2023)
APAPCET-2023 ఆన్‌లైన్ వెబ్‌కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా కింది సర్టిఫికెట్‌లను కలిగి ఉండాలి:
- APEAPCET-2023 ర్యాంక్ కార్డ్ (అసలు, రెండు జెరాక్స్ కాపీలు).
- APEAPCET-2023 హాల్ టికెట్ (అసలు, రెండు జిరాక్స్ కాపీలు).
- మార్కులు మెమోరాండం (ఇంటర్ లేదా దాని సమానం).
- పుట్టిన తేదీ ప్రూఫ్ (SSC లేదా దానికి సమానమైన మెమో).
- బదిలీ సర్టిఫికెట్ (TC).
- ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్.
- EWS సర్టిఫికెట్
- నివాస ధ్రువీకరణ పత్రం
- 10 సంవత్సరాల పాటు తండ్రి/తల్లి ఆంధ్రప్రదేశ్ నివాస ధ్రువీకరణ పత్రం
- ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్
- అన్ని మూలాల నుంచి తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం
- స్థానిక స్థితి ప్రమాణపత్రం (వర్తిస్తే)
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా వద్ద కూడా మాకు వ్రాయవచ్చు ఈ-మెయిల్ ID news@collegedekho.com.