ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2023లో (AP EAP CET 2023 /AP EAMCET 2023) భాగంగా మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఏపీ ఎంసెట్/ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు గతేడాది కంటే రెండు నెలలు ముందుగా అంటే మే 15 నుంచే మొదలవుతున్నాయి. అంటే జూన్ నెలాఖరుకల్లా అడ్మిషన్లతో సహా మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో జూలై నుంచే తరగతులు ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ తేదీలు
ఏపీ ఎంసెట్ 2023 ఎగ్జామ్ డేట్ (AP EAMCET 2023 Exam Date)
ఏపీ ఎసెంట్ 2023 (AP EAMCET 2023) ఎగ్జామ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు గురించి, ఇతర వివరాలు గురించి ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.కార్యక్రమం | ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ డేట్ |
---|---|
పరీక్ష ప్రారంభం | మే 15, 2023 |
ఎగ్జామ్ ముగింపు తేదీ | మే 22, 2023 |
మార్నింగ్ సెషన్ టైమింగ్స్ | ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 |
మధ్యాహ్నం సెషన్ టైమింగ్స్ | మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు |
అధికారిక వెబ్‌సైట్ | https://cets.apsche.ap.gov.in |
ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023/ AP EAP CET 2023) పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. వివిధ షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పేపర్ విధానం ఒకేలా ఉంటుంది. అయితే షిప్ట్‌ల్లో ప్రశ్నలు మారుతూ ఉంటాయి. ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023) దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్లికేషన్ కోసం ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
ఇవి కూడా చదవండి - ఏపీ ECET 2023 ఎగ్జామ్ షెడ్యూల్
ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023)కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా APSCHE ద్వారా నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ పరీక్షకు 2023లో ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన వారు కూడా అర్హులు. ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అడ్మిషన్ సమయంలో కచ్చితంగా వారు ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023) గురించి అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in చూడొచ్చు.