AP EAMCET ఫలితం తేదీ 2023 (AP EAMCET Result Date 2023):
JNTU AP EAMCET 2023 పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. (గత సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా). అధికారులు AP EAMCET 2023 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్
cets.apsche.ap.gov.in
లో విడుదల చేస్తారు. AP EAMCET ఫలితం 2023ని (AP EAMCET Result Date 2023)
యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు పుట్టిన తేదీతోపాటు హాల్ టికెట్ నెంబర్‌ని కూడా దగ్గరే ఉంచుకోవాలి. AP EAMCET ఫలితం 20203లో సబ్జెక్ట్ వారీగా అభ్యర్థి వ్యక్తిగత సమాచారం ఉంటుంది. పరీక్షకు విజయవంతంగా అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియకు ఆహ్వానించబడతారు. AP EAMCET పరీక్షకు అర్హత సాధించడానికి, జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షలో 25% సాధించి ఉండాలి. SC/ST కేటగిరీ అభ్యర్థికి కనీస అర్హత మార్కులు లేదు.
వీటిని కూడా చెక్ చేయండి..
ఏపీ ఎంసెట్ 2023 క్వశ్చన్ పేపర్ (రోజంతా మరియు షిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి) |
AP EAMCET ఫలితం 2023 అంచనా తేదీ (AP EAMCET Result 2023 Expected Date)
ఈ దిగువన ఉన్న అభ్యర్థి AP EAMCET 2023 ఫలితాల విడుదలయ్యే తేదీ ఇక్కడ చెక్ చేయవచ్చు.
ఈవెంట్స్ | అంచనా తేదీలు |
---|---|
AP EAMCET 2023 ఫలితాల ప్రకటన తేదీ | జూన్ మొదటి వారం |
ఫలితాల ప్రకటన సమయం | మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఆశించవచ్చు |
AP EAMCET 2023 ఫలితాన్ని ఎలా చెక్ చేయాలి? (How to check the AP EAMCET Result 2023?)
ఈ దిగువ అభ్యర్థి AP EAMCET 2023 ఫలితాన్ని యాక్సెస్ చేయడానికి విధానాన్ని చెక్ చేయవచ్చు.
- అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ని సందర్శించండి
- హోంపేజీలో తదుపరి AP EAMCET result 2023 linkపై క్లిక్ చేయండి
- అభ్యర్థి లాగిన్ పేజీకి రీడైరక్ట్ అవుతారు. అభ్యర్థులు అవసరమైన లాగిన్ ఆధారాలను రిజిస్టర్ చేయాలి.
- ఫలితాన్ని యాక్సెస్ చేయడానికి పుట్టిన తేదీతో పాటు హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయండి
- అప్లికేషన్ ఫార్మ్‌లో పూరించిన వివరాల ప్రకారం ర్యాంక్ కార్డ్‌లో ఉన్న వ్యక్తిగత వివరాలని కచ్చితత్వాన్ని చెక్ చేయండి.
- చివరగా అభ్యర్థి భవిష్యత్తు సూచన కోసం AP EAMCET ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.