ఫిబ్రవరిలో AP EAPCET 2023 నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ, అర్హత

Andaluri Veni

Updated On: January 13, 2023 03:36 PM

ఏపీ ఎప్‌సెట్ 2023 (AP EAPCET 2023) నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు గురించి ఈ  ఆర్టికల్ ద్వారా తెలియజేశాం. ఏపీ ఎంసెట్‌గా నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షను గత ఏడాది ఏపీ ఎప్‌సెట్‌గా మార్చారు.

ఫిబ్రవరిలో AP EAPCET 2023 నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ, అర్హత

ఏపీ ఎప్‌సెట్ 2023 (AP EAPCET 2023): గతంలో జరిగిన ఏపీ ఎప్‌సెట్ ఎగ్జామ్స్‌‌ విశ్లేషణ ప్రకారం  ఏపీ ఎప్‌సెట్ 2023 (AP EAPCET 2023) (Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ ఎప్‌సెట్ 2023 ప్రవేశ పరీక్ష (AP EAPCET 2023) డేట్‌ను సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.inలో ప్రకటించడం జరుగుతుంది. AP EAPCET 2023కు చెందిన రిజిస్ట్రేషన్ 2023 జూన్‌ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్, ఆగస్ట్‌ నెలల్లో AP EAPCET ఉండే ఛాన్స్ ఉంది.

ఏపీ ఎప్‌సెట్ 2023 గురించి (About AP EAPCET 2023)

ఏపీ ఎప్‌సెట్ 2023 (AP EAPCET 2023) ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరానికి  ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇది రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTUK) కాకినాడ ద్వారా ప్రతి ఏడాది  ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలో (AP EAPCET 2023) అర్హత సాధించిన విద్యార్థులు వివిధ డిగ్రీ కళాశాలల్లో ఇంజనీరింగ్, మెడికల్, వ్యవసాయ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ అడ్మిషన్ ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు చేసుకోవడం, అడ్మిట్ కార్డ్ పొందడం, ఆన్సర్ కీ,  రిజల్ట్, కౌన్సెలింగ్ వంటి ప్రక్రియలు ఉంటాయి. ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది.

ఏపీ ఎప్‌సెట్ 2023 అర్హతలు (AP EAPCET 2023 Eligibility Criteria)

ఇవ్వడం జరుగుతుంది ఏపీ ఎప్‌సెట్ 2023 రాయాలనుకునే అభ్యర్థులకు కొన్ని అర్హతలు ఉండాలి. AP EAPCET 2023 కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఒక్కసారి ఏపీ ఎప్‌సెట్‌కు కావాల్సిన అర్హతలు గురించి తెలుసుకుని ఉండాలి. ఏపీ ఎప్‌సెట్ 2023కు అటెండ్ అయ్యే విద్యార్థులకు తప్పనిసరిగా ఈ కింద తెలియజేసిన అర్హతలు ఉండాలి.

  • తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి

  • అభ్యర్థి స్థానిక వ్యక్తి అయితే ఆ అర్హతలకు తగ్గట్టుగా, స్థానికేతర వ్యక్తి అయితే ఆ అర్హతలకు అనుగుణంగా ఉండాలి.

  • ప్రభుత్వంతో జారీ చేయబడిన గుర్తింపు కార్డు ఉండాలి.

  • ఇంజనీరింగ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయోలజీ సబ్జెక్టులతో ఇంటర్ పాసై ఉండాలి. కచ్చితంగా ఇంటర్‌లో 45 శాతం మార్కులు పొంది ఉండాలి. రిజర్వేషన్ కేటగిరికి చెందిన విద్యార్థులైతే 40 శాతం మార్కులు పొంది ఉండాలి.

  • అగ్రికల్చర్, లేదా ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, మ్యాథ్స్  సబ్జెక్టుల్లో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే 45 శాతం మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులైతే 40 శాతం మార్కులు పొంది ఉండాలి.

  • ఏపీ ఎప్‌సెట్ 2023 రాయాలనుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 16 ఏళ్లు నిండి ఉండాలి.

  • భారతీయ పౌరుడై ఉండాలి

ఏపీ ఎప్‌సెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP EAPCET 2023 Exam Dates)

ఏపీ ఎప్‌సెట్‌ 2023 (AP EAPCET 2023)కు సంబంధించిన పూర్తి సమాచారం దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.

కార్యక్రమం

ముఖ్యమైన తేదీలు

ఏపీ ఎప్‌సెట్ 2023 అప్లికేషన్ ప్రారంభం తెలియాల్సి ఉంది
ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ సబ్మిట్  చేసే తేదీ తెలియాల్సి ఉంది
ఆలస్య రుసుము రూ.500లతో అప్లికేషన్ సబ్మిట్ చేసే తేదీ తెలియాల్సి ఉంది
సబ్మిట్ చేసిన దరఖాస్తును సరిచేసుకొనుట తెలియాల్సి ఉంది
రూ.1000ల ఆలస్య రుసుముతో అప్లికేషన్ సమర్పించే తేదీ తెలియాల్సి ఉంది
రూ.5000ల ఆలస్య రుసుముతో అప్లికేషన్ సమర్పించే తేదీ తెలియాల్సి ఉంది
ఏపీ ఎప్‌సెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ తెలియాల్సి ఉంది
రూ.10000ల ఆలస్య రుసుముతో అప్లికేషన్ సమర్పించే తేదీ తెలియాల్సి ఉంది
ఏపీ ఎప్‌సెట్ ఎగ్జామ్ డేట్ తెలియాల్సి ఉంది
ప్రిలిమనరీ ఆన్సర్ కీ రిలీజ్ డేట్ తెలియాల్సి ఉంది
ఏపీ ఎప్‌సెట్ 2023 ఫలితాలు విడుదల తెలియాల్సి ఉంది
ఏపీ ఎప్‌సెట్ 2023 కౌన్సెలింగ్ తెలియాల్సి ఉంది


ఏపీ ఎప్‌సెట్ 2023 నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekhoని చూస్తూ ఉండండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eapcet-2023-application-process-35294/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top