AP EAPCET BiPC 2022 వెబ్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించిన బోర్డు, ముఖ్యమైన తేదీలు, వివరాలు తెలుసుకోండి.

Guttikonda Sai

Updated On: December 22, 2022 02:20 PM

AP EAPCET BiPC 2022 ముఖ్యమైన తేదీలు, కౌన్సెలింగ్  సమాచారం
AP EAPCET BiPC 2022 వెబ్  కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించిన  బోర్డు, ముఖ్యమైన తేదీలు, వివరాలు తెలుసుకోండి.

AP EAPCET BiPC  2022 : ఆంధ్ర ప్రదేశ్ EAPCET బోర్డు , 2022 వ సంవత్సరానికి  B.E/B.Tech(Bio-Technology, Food Technology & Pharmaceutical Engg.)/B.Pharmacy/Pharm-D కోర్సులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెబ్ కౌన్సిలింగ్ మరియు వెబ్ ఆప్షన్ లు నమోదు చేసుకునే తేదీలను ప్రకటించింది. AP EAPCET BiPC  2022 లో అర్హత పొందిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ ద్వారా వారికి కావాల్సిన కాలేజ్ లేదా యునివర్సిటీ లను ఎంపిక చేసుకోవచ్చు.  10-12-2022 తేదీ నుండి 16-12-2022 తేదీ వరకు  AP EAPCET BiPC 2022 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత విద్యార్థులకు సీట్ల కేటాయింపు మరియు విద్యార్థులు కాలేజ్ లో రిపోర్ట్ చెయ్యాల్సి ఉంటుంది. ఏయే రోజుల్లో ఏ ప్రక్రియ జరుగుతుంది మరియు కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు ఎలా చెల్లించాలి? వెబ్ ఆప్షన్స్ ఎలా నమోదు చేసుకోవాలి? AP EAPCET BiPC 2022  గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

AP EAPCET BiPC  2022  వెబ్ కౌన్సిలింగ్ లో ముఖ్యమైన తేదీలు

AP EAPCET BiPC  2022 కౌన్సెలింగ్ తేదీలను ఈ క్రింద పట్టికలో చూడవచ్చు. AP EAPCET BiPC  2022  అర్హత పొందిన విద్యార్థులు ఈ క్రింద వివరించిన తేదీలను అనుసరించి వారి సర్టిఫికెట్ల  వెరిఫికేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసే ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

ప్రక్రియ

తేదీ

ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు లేదా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం, ఆన్లైన్ లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్.

10-12-2022 నుండి 12-12-2022 వరకు.

ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను కేటాయించిన హెల్ప్ లైన్ సెంటర్ల ద్వారా వెరిఫికేషన్ చెయ్యడం.

12-12-2022 నుండి 15-12-2022 వరకు

అర్హత పొందిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడం.

13-12-2022 నుండి 16-12-2022 వరకు

వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడం.

16-12-2022

సీట్ల కేటాయింపు.

19-12-2022

కేటాయించిన కాలేజ్ లో రిపోర్ట్ చెయ్యడం.

20-12-2022 నుండి 23-12-2022 వరకు



AP EAPCET BiPC 2022 రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించడం ఎలా?

AP EAPCET BiPC  2022  కు అర్హత పొందిన విద్యార్థులు https://eapcet-sche.aptonline.in/EAPCETAGR/register.do ఈ లింక్ మీద క్లిక్ చేస్తే  AP EAPCET హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చెయ్యమని చూపిస్తుంది. ఆ వివరాలను అక్కడ ఎంటర్ చేసిన తర్వాత  మీకు AP EAPCET  రిజిస్ట్రేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలు అన్ని సరి చూసుకున్న తర్వాత AP EAPCET BiPC  2022 కోసం  వెబ్ కౌన్సెలింగ్ ప్రోసెసింగ్ ఫీజు చెల్లించండి. AP EAPCET BiPC  2022 అభ్యర్థులు అందరూ 10-12-2022 నుండి 12-12-2022 లోపు ఈ ఫీజు చెల్లించాలి.

AP EAPCET BiPC  2022 ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ

AP EAPCET BiPC  2022  ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తర్వాత విద్యార్థి సర్టిఫికెట్లు ఆన్లైన్ లో ఎలా వెరిఫై చేపించాలి అని ఇక్కడ చదవండి.

  • మీ యొక్క సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి అయ్యి ఉంటే, ఏవైనా తప్పులు ఉన్నాయి ఏమో అని మళ్ళీ సరి చూసుకోండి. ఒక వేళ అన్ని సరిగా ఉంటే మీరు మళ్ళీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చెయ్యాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ నమోదు తేదీ వరకు వేచి ఉండాలి.
  • ఒకవేళ మీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరిగి అందులో ఏవైనా తప్పులు ఉండి ఉంటే, మీరు మళ్ళీ మీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి ఆన్లైన్ లో వెరిఫై చేపించుకోవాలి. ఈ ప్రక్రియలో ఏదైనా సమస్య ఎదురైతే AP EAPCET  హెల్ప్ లైన్ సెంటర్ లో సంప్రదించవచ్చు.
  • ఒకవేళ ఆన్లైన్ లో మీరు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అవ్వలేదు అంటే, మీరు మీ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి మీకు కేటాయించిన హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా ఆన్లైన్ లోనే సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పూర్తి చెయ్యండి.
  • PH, CAP, NCC, Sports and Games కోటా అభ్యర్థులు ( ఆన్లైన్ లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వారు మరియు పూర్తి చెయ్యని వారు) తప్పకుండా విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో సంబంధిత తేదీలలో AP EAPCET BiPC  2022 కౌన్సెలింగ్ కు  హాజరు అవ్వాలి.

Note: పైన వివరించిన మూడు విధానాల్లో మీరు AP EAPCET  హెల్ప్ లైన్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.

AP EAPCET BiPC  2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఏం చేయాలి?

AP EAPCET BiPC  2022  రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాక విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా నమోదు చేసుకోవాలో ఇక్కడ చదవండి.

రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక " Verification Status" మీద క్లిక్ చేసి మీ AP EAPCET  హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.

  • " Candidate is eligible for exercising options" అని ఉంటే మీకు కేటాయించిన తేదీలలో మీరు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు.
  • " candidate is not eligible or certificate verification is in progress" అని ఉంటే మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు అని అర్థం.  ఇలా జరిగినప్పుడు ఆన్లైన్ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసి తర్వాత వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చు. లేదా AP EAPCET BiPC  2022 హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవచ్చు.

గమనిక : AP EAPCET BiPC  2022 వెబ్ కౌన్సెలింగ్ కోసం PH, NCC, CAP, SPORTS AND GAMES , ANGLO - INDIAN అభ్యర్థులు అందరూ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేపించుకోవాలి అని ముందే వివరించడం జరిగింది. ఏ ర్యాంక్ వారు ఏ తేదీన వెళ్ళాలో క్రింద చదవండి.

తేదీ

కేటగిరీ

రాంక్

ఈ రాంక్ నుండి

ఈ రాంక్ వరకు.

13-12-2022

NCC

1

45000

SPORTS & GAMES

1

45000

CAP

1

45000

14-12-2022

NCC

45001

చివరి రాంక్ వరకు.

SPORTS & GAMES

45001

చివరి రాంక్ వరకు

CAP

45001

చివరి రాంక్ వరకు.

PH

1

చివరి రాంక్ వరకు.

ANGLO-INDIAN

1

చివరి రాంక్ వరకు.






AP EAPCET BiPC 2022 లో ఏవైనా సందేహాలు ఉన్నా లేదా మరింత సమాచారం కోసం హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లకు కాల్ చెయ్యవచ్చు. AP EAPCET BiPC  2022 హెల్ప్ డెస్క్ నెంబర్లు : 7995681678 , 7995865456, 9177927677 ( ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు)

Stay tuned to CollegeDekho for the latest updates on AP EAPCET BiPC Stream Counseling 2022

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eapcet-bipc-2022-web-counselling-dates-released-34021/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top