ఇవి కూడా చదవండి: ఏపీ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు
ఏపీ ఈసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ECET 2023 Important Dates)
AP ECET 2023 ఎగ్జామ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు గురించి ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు..
కార్యక్రమం | ముఖ్యమైన తేదీలు |
---|---|
దరఖాస్తు ఫార్మ్ విడుదల | మార్చి 10, 2023 (అంచనా ) |
దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్ డేట్ | ఏప్రిల్ 10, 2023 (అంచనా) |
అడ్మిట్ కార్డులు విడుదల | ఏప్రిల్ 28, 2023 (అంచనా) |
ఎగ్జామ్ డేట్ | మే 5, 2023 |
ఏపీ ఈసెట్ 2023 అర్హతలు (AP ECET 2023 Eligibility)
- ఏపీ ఈసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా భారతీయులై ఉండాలి.
- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
- ఏపీ, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి సంబంధిత డిప్లొమాలో 40 శాతం మార్కులతో పాసై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేసి ఉండాలి.
ఏపీ ఈసెట్ 2023 రిజిస్ట్రేషన్ (AP ECET 2023 Registration)
ఏపీ ఈసెట్ 2023 (AP ECET 2023 Registration) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో ఉటుంది. ఏపీ అధికారిక ఈసెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. ఫస్ట్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి. తర్వాత అభ్యర్థి విద్యా, వ్యక్తిగత వివరాలు అప్లికేషన్‌లో పూరించాలి. తర్వాత దరఖాస్తును మళ్లీ చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అభ్యర్థులు కొన్ని సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. వాటి వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- పదో తరగతి హాల్ టికెట్
- బర్త్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- PH, NCC, Sports సర్టిఫికెట్లు
- స్టడీ, రెసిడెన్సీ సర్టిఫికెట్లు
ఏపీ ఈసెట్ 2023 దరఖాస్తు ఫీజు (AP ECET 2023 Application Fee)
ఏపీ ఈసెట్ 2023 (AP ECET 2023)కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులైతే రూ.600లు, బీసీ అభ్యర్థులైతే రూ.550లు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులైతే రూ.500లు చెల్లించాలి. దరఖాస్తు రుసుమును అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.ఇవి కూడా చదవండి: ఏపీ ఈసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల తేదీ
ఏపీ ఈసెట్ 2023 (AP ECET 2023)కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekho ని చూస్తూ ఉండండి.