AP ECET 2023 Registration: నేటి నుంచి ఏపీ ఈసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Andaluri Veni

Updated On: March 10, 2023 12:20 PM

ఏపీ ఈసెట్ 2023 రిజిస్ట్రేషన్ (AP ECET 2023 Registration) ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.   
 
AP ECET 2023 Registration Starts Today:  నేటి నుంచి ఏపీ ఈసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?AP ECET 2023 Registration Starts Today: నేటి నుంచి ఏపీ ఈసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ఏపీ ఈసెట్ 2023 రిజిస్ట్రేషన్ (AP ECET 2023 Registration): ఏపీ ఈసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి (AP ECET 2023 Registration ) ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌‌లోకి వెళ్లి అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. AP ECET 2023 కోసం అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి లింక్ cets.apsche.ap.gov.in లో యాక్టివేట్ చేయబడుతుంది. అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి వివిధ దశలను అభ్యర్థులు ఫాలో అవ్వాలి. మొదట దరఖాస్తు ఫీజు చెల్లించాలి. తర్వాత పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సూచించిన సైజ్‌లో ఫోటోను అప్‌లోడ్ చేసి చివరిగా సబ్మిట్ చేయాలి. అభ్యర్థుల కోసం ఈ దిగువున డైరక్ట్ లింక్ అందజేశాం. దానిపై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ కోసం డైరక్ట్ లింక్

ఏపీ ఈసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ECET 2023 Important Dates)

ఇప్పటికే AP ECET 2023 నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఏపీ ఈసెట్ 2023 ఎగ్జామ్ మే 5, 2023వ తేదీన జరుగుతుంది. ఏపీ ఈసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
ఈవెంట్ తేదీలు
అధికారిక నోటిఫికేషన్ విడుదల మార్చి 8, 2023
అప్లికేషన్ ఫార్మ్ విడుదల మార్చి 10, 2023
ఆలస్య రుసుము లేకుండా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 10, 2023
ఆలస్య రుసుము రూ.500లతో అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 11 నుంచి 15, 2023 వరకు
ఆలస్య రుసుము రూ.2,000తో అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 16 నుంచి 19, 2023 వరకు
ఆలస్య రుసుము రూ.5,000లతో అప్లికేషన్ ఫార్మ్  సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 20 నుంచి 24, 2023
హాల్ టికెట్ విడుదల ఏప్రిల్ 28, 2023

ఏపీ ఈసెట్ 2023 అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు (Documents Required to Fill AP ECET 2023 Application Form)

ఏపీ ఈసెట్ 2023 అప్లికేషన్‌ని పూరించడానికి అభ్యర్థుల దగ్గర కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉండాలి. అప్లికేషన్ ఫిల్ చేయడానికి ముందే అభ్యర్థులు వాటిని దగ్గర ఉంచుకోవాలి. అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్ల గురించి ఈ దిగువున అందజేశాం.
  • క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అకౌంట్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్
  • మార్క్స్ మెమో, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్, పదో తరగతి
  • పదో తరగతి సర్టిఫికెట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • స్పెషల్ కేటగిరి సర్టిఫికెట్ (NCC/PH/Sports/CAP etc)
  • ఆరో తరగతి నుంచి ఇంటర్ లేదా డిగ్రీ లేదా డిప్లమా వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • కేస్ట్ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డ్
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (50 కేబీ సైజ్)
  • వైట్ పేపర్‌పై బ్లాక్ పెన్‌తో చేసిన సంతకం ఇమేజ్ (30 కేబీ సైజ్)

ఏపీ ఈసెట్ 2023 దరఖాస్తు విధానం  (Procedure to Fill AP ECET Application Form 2023)

ఏపీ ఈసెట్ 2023కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ దిగువున తెలియజేసిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు చెల్లింపు

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in ని సందర్శించాలి.
  • వెబ్‌సైట్‌లో "fee payment" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
  • తర్వాత పేమంట్ పేజీ ఓపెన్ అవుతుంది
  • ఆ పేజీలో అభ్యర్థి పేరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలు ఫిల్ చేయాలి
  • తర్వాత "Initiate payment" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
  • తర్వాత పేమంట్ గేట్‌వేకి పేజీ రీడైరక్ట్ అవుతుంది
  • ఆన్‌లైన్ పేమంట్ ఆప్షన్‌‌లో ఏదో ఒక దానిని ఎంచుకుని ఫీజు చెల్లించాలి
  • పేమంట్ ఫీజు చెల్లింపు పూర్తి అవ్వగానే Payment ID జనరేట్ అవుతుంది.
  • Payment IDని నోట్ చేసుకుని అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడం కొనసాగించాలి.

ఏపీ ఈసెట్ 2023 అప్లికేషన్  (AP ECET 2023 Application Form)

  • ఫీజు పేమంట్ పూర్తైన తర్వాత Fill Application అనే ఆప్షన్ హైలెట్ అవుతుంది దానిపై క్లిక్ చేయాలి
  • తర్వాత పేమంట్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్  వివరాలు ఇచ్చి Procced to fill Applicationపై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే అప్లికేషన్‌లో అభ్యర్థులు తమ ఎడ్యుకేషన్ వివరాలు ఇవ్వాలి
  • అన్ని వివరాలు నమోదు చేశాకా Save OR Preview/ Submit అనే ఆప్షన్‌‌లపై క్లిక్ చేయాలి.
  • తర్వాత అభ్యర్థులు సూచించిన విధంగా ఫోట్, సంతకం చేసిన ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

AP ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి


ఎడ్యుకేషన్ న్యూస్ అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు College Dekhoని ఫాలో అవుతూ ఉండండి

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-ecet-2023-registration-started-37675/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top