AP ECET 2023 దరఖాస్తుకు లాస్ట్‌డేట్ (AP ECET application form 2023 Last Date): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET) మే 05, 2023న నిర్వహించబడుతోంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10, 2023న ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in లో అప్లికేషన్లు సబ్మిట్ చేయవచ్చు. ఎటువంటి లేట్ ఫీజు లేకుండా దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి ఈరోజే (APRIL 10) చివరి తేదీ. ఇప్పటి వరకు దరఖాస్తు (AP ECET application form 2023 Last Date) చేసుకోని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. అయితే ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24, 2023 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. AP ECET 2023కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
AP ECET 2023 దరఖాస్తు ఫార్మ్ ఆలస్య రుసుము తేదీలు (AP ECET Application Form 2023 Late Fee Dates)
AP ECET 2023 దరఖాస్తు ఫార్మ్ సబ్మిషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఆలస్య రుసుము ప్రకారం గడువు తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ తేదీలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు.ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ డేట్ | మార్చి 10, 2023 (Friday) |
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ | ఏప్రిల్ 10, 2023 (Monday |
లేట్ ఫీజు రూ.500లతో దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 15, 2023 (Saturday) |
లేట్ ఫీజు రూ.2000లతో దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 19, 2023 (Wednesday) |
లేట్ ఫీజు రూ.5000లతో దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 24, 2023 (Monday) |
ఇప్పటికే సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫార్మ్‌ల సవరణ కోసం ఒక విండో ఏప్రిల్ 20, 2023 (గురువారం) ఓపెన్ అవుతుంది. ఇది ఏప్రిల్ 22, 2023 (శనివారం)న క్లోజ్ అవుతుంది. అందువల్ల దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వివరాలను సవరించడం జరగదు. దరఖాస్తు ప్రక్రియలో ఏదైనా పొరపాట్లు జరిగితే అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియలో జరిగిన పొరపాట్లను దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోవాలి. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ ఈసెట్ 2023కు సంబంధించిన మరిన్ని వివరాలు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్/అప్లికేషన్ లింక్ కోసం, ఇక్కడ క్లిక్ చేయండి:
ఏపీ ఈసెట్ 2023 పూర్తి వివరాలు |
---|
తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.