AP ECET హాల్ టికెట్ 2023 (AP ECET Hall Ticket 2023): AP ECET హల్ టికెట్ 2023ని (AP ECET Hall Ticket 2023) JNTU కాకినాడ ఈరోజు అధికారిక వెబ్‌సైట్‌లో cets.apsche.ap.gov.in విడుదల చేసింది. AP ECET 2023 కోసం హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు ముఖ్యమైన పరీక్ష రోజు మార్గదర్శకాలు, వ్యక్తిగత వివరాలని కూడా తెలుసుకుంటారు. ఈ సంవత్సరం, AP ECET పరీక్ష జూన్ 20, 2023న నిర్వహించబడుతుంది. పరీక్ష రోజున అభ్యర్థులు హాల్ టికెట్‌ని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లడం మరిచిపోవద్దు. లేకపోతే అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించబడరు. హాల్ టికెట్‌తో పాటు అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ని తీసుకెళ్లాలి.
AP ECET హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ (AP ECET Hall Ticket 2023 Download Link)
AP ECET హాల్ టికెట్‌ను విడుదల చేయడానికి అధికారిక సమయాన్ని అధికారం ఇంకా ప్రకటించలేదు. హాల్ టికెట్ విడుదలైన తర్వాత హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇచ్చిన టేబుల్లో జోడించబడింది. క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి.
AP ECET 2023 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ |
---|
AP ECET హాల్ టికెట్ 2023 విడుదల సమయం (AP ECET Hall Ticket 2023 Release Time)
AP ECET హాల్ టికెట్ 2023 విడుదల సమయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇక్కడ ఉన్నాయి -
హాల్ టికెట్ విడుదల తేదీ | జూన్ 12, 2023 |
---|---|
విడుదల సమయం | విడుదల |
పరీక్ష తేదీ | జూన్ 20, 2023 |
AP ECET 2023 హాల్ టికెట్ తర్వాత ఏమిటి? (What After AP ECET 2023 Hall Ticket?)
AP ECET హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు దాని ప్రింట్ అవుట్ తీసుకోవడం మరిచిపోకూడదు. అలాగే అభ్యర్థులు హాల్ టికెట్‌పైన పేర్కొన్న వివరాలను ని క్షుణ్ణంగా చెక్ చేయాలి. వ్యక్తిగత డేటా, పరీక్ష వివరాలు, ఇతర సంబంధిత సూచనలు సరిగ్గా ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. అభ్యర్థులు ఏదైనా వ్యత్యాసాన్ని కనుగొంటే వెంటనే సవరణలు చేయడానికి సంబంధిత అధికారిని సంప్రదించాలి. పరీక్ష రోజు ముందు దిద్దుబాటు చేసుకోవాలి.
AP ECET 2023 పరీక్ష రోజు మార్గదర్శకాలు (AP ECET 2023 Exam Day Guidelines)
అభ్యర్థులు AP ECET 2023 పరీక్ష రోజు మార్గదర్శకాలను ఈ కింది సెక్షన్‌లో చూడవచ్చు.
- అభ్యర్థులు AP ECET పరీక్ష రోజు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. లేకెపోతే వారు పరీక్షకు హాజరు కావడానికి అనుమతి పొందరు
- అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు
- అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్లూటూత్ పరికరాలు, పేజర్‌లను పరీక్ష హాల్‌కు తీసుకెళ్లకూడదు
- అభ్యర్థులతో ఏదైనా మాల్‌ప్రాక్టీస్ చేస్తూ అభ్యర్థులు పట్టుబడితే వారు నిర్దిష్ట పరీక్ష నుంచి అలాగే భవిష్యత్తులో జరిగే పరీక్షలకు అనర్హులవుతారు.
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు రాయవచ్చు.