AP EDCET ఫేజ్ 1 సీట్ల కేటాయింపు జాబితా 2024 విడుదల, డౌన్‌లోడ్ లింక్, రిపోర్టింగ్ తేదీలు

Andaluri Veni

Updated On: September 10, 2024 02:33 pm IST

AP EDCET ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితం 2024 అధికారిక వెబ్‌సైట్‌లో ఈరోజు అంటే సెప్టెంబర్ 10న విడుదలైంది. అలాట్‌మెంట్ కోసం డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ అందించాం. ఈ  దిగువ మొదటి దశ కోసం రిపోర్టింగ్ తేదీలను కూడా చూడండి.
AP EDCET ఫేజ్ 1 సీట్ల కేటాయింపు జాబితా 2024 విడుదల, డౌన్‌లోడ్ లింక్, రిపోర్టింగ్ తేదీలుAP EDCET ఫేజ్ 1 సీట్ల కేటాయింపు జాబితా 2024 విడుదల, డౌన్‌లోడ్ లింక్, రిపోర్టింగ్ తేదీలు

ఏపీ ఎడ్‌సెట్ ఫేజ్ 1 అలాట్‌మెంట్ రిజల్ట్ లింక్ 2024 (AP EDCET Phase 1 Allotment Result Link 2024) : APSCHE ఈరోజు అంటే సెప్టెంబర్ 10, 2024న అధికారిక వెబ్‌సైట్‌లో AP EDCET కౌన్సెలింగ్ మొదటి దశ  సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసింది.  AP EDCET ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితం 2024ని డౌన్‌లోడ్ చేయడానికి డైరక్ట్ లింక్ విడుదలైన తర్వాత అభ్యర్థుల కోసం ఇక్కడ షేర్ చేయబడుతుంది. APSCHE సూచనల ప్రకారం, అభ్యర్థులు AP EDCET ఫేజ్ 1 ఫలితం 2024ను యాక్సెస్ చేయడానికి వారి అర్హత పరీక్ష హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ ముఖ్యమైన తేదీలు, ఫలితాన్ని నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

AP EDCET ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితం 2024 డౌన్‌లోడ్ లింక్ (AP EDCET Phase 1 Seat Allotment Result 2024 Download Link)

ఫలితాల లింక్ దిగువన భాగస్వామ్యం చేయబడింది, దీని కోసం అభ్యర్థులు వెబ్‌సైట్ లాగిన్ పేజీకి మళ్లించబడతారు:

AP EDCET ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితం 2024 లింక్

AP EDCET ఫేజ్ 1 కాలేజీలవారీగా అలాట్‌మెంట్ 2024

A P EDCET ఫేజ్ 1 కౌన్సెలింగ్ రిపోర్టింగ్ తేదీలు 2024 (AP EDCET Phase 1 Counselling Reporting Dates 2024)

ఈ దిగువ ఇవ్వబడిన పట్టికలో మొదటి దశ కోసం AP EdCET కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో పేర్కొన్న తేదీలు ఇక్కడ ఉన్నాయి:

AP EDCET ఫేజ్ 1 ఈవెంట్‌లు

తేదీలు

ఫేజ్ 1 కేటాయింపు ఫలితం 2024

సెప్టెంబర్ 10, 2024

సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది

సెప్టెంబర్ 10, 2024

సీటు నిర్ధారించడానికి చివరి తేదీ (ఫేజ్ 1)

సెప్టెంబర్ 13, 2024

తరగతుల ప్రారంభం

సెప్టెంబర్ 11, 2024

అభ్యర్థులు తమ సీట్లను నిర్ధారించుకోవడానికి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత వారి సంబంధిత కళాశాలలకు రిపోర్ట్ చేయాలి. కేటాయించిన కళాశాల డాక్యుమెంట్లను ధ్రువీకరించి విద్యార్థికి ప్రవేశ పత్రాన్ని అందిస్తుంది. అలాగే, అభ్యర్థులు మొదటి దశ ముగిసేలోపు వారి కోర్సు కోసం పూర్తి కళాశాల ఫీజును చెల్లించాలి. లేకపోతే సీటు ఆటోమేటిక్‌గా తదుపరి రౌండ్‌కి తరలించబడుతుంది. మొదటి దశ ముగిసిన తర్వాత రెండో దశ తేదీలను కౌన్సిల్ ప్రకటించవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-edcet-phase-1-seat-allotment-result-2024-released-download-link-reporting-dates-57429/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top