ఏపీ గురుకులం ఇంటర్ ఫలితాలు 2024 (AP Gurukkulam Inter Results 2024) : ఏపీ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బుధవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలతో పాటు ర్యాంకు కార్డుల కోసం అభ్యర్ధులు http.//apbragcet.apcfss.in లో అందుబాటులో ఉన్నాయి. కాగా జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. పరీక్షకు 35,629 మంది విద్యార్థులు హాజరయ్యారు.
గురుకులం ఇంటర్ ఫలితాలు 2024 ర్యాంక్ కార్డు లింక్ (Gurukulam Inter Results 2024 Rank Card Link)
గురుకులం ఇంటర్ ఫలితాలు 2024 ర్యాంక్ కార్డు లింక్ |
---|
ఏపీ గురుకులం ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download AP Gurukulam Intermediate Results 2024?)
అభ్యర్థులు తమ ఫలితాలను ఈ దిగువున చెప్పిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.- ముందుగా అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కి http.//apbragcet.apcfss.in వెళ్లాలి.
- హోంపేజీలో Message Boardలో "Rank Results" ఎదురుగా Click Here అనే దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో విద్యార్థులు తమ ఆధార్ నెంబరు, పుట్టినతేదీ, ఫోన్ నెంబరు వివరాలు నమోదు చేసి స్కోరుకార్డు పొందవచ్చు.
- లేదా ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై కూడా క్లిక్ చేయవచ్చు.
గురుకులం ఇంటర్మీడియట్ ర్యాంకు కార్డుపై ఉండే వివరాలు (Gurukulam Inter Results 2024 Rank Card)
గురుకులం ఇంటర్మీడియట్ ర్యాంకు కార్డుపై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.- విద్యార్థి పేరు
- విద్యార్థి తల్లిదండ్రుల పేరు
- విద్యార్థి రోల్ నెంబర్
- విద్యార్తి ర్యాంకు
- విద్యార్థి సాధించిన స్కోర్