ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023: ఏపీ ఐసెట్ 2023 పరీక్ష అప్లికేషన్ ఫార్మ్ విడుదలైంది. పరీక్ష నిర్వహణ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫార్మ్‌ని విడుదల చేసింది. అభ్యర్థులకు అప్లికేషన్ ఫార్మ్ నేటి నుంచి అంటే మార్చి 20, 2023 నుంచి అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని MBA/MCA కళాశాలల్లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు ఏపీ ఐసెట్ 2023కు హాజరు కావాలి. ఏపీ ఐసెట్ 2023 కు హాజరయ్యేందుకు తప్పనిసరిగా AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ విండోను క్లోజ్ చేయక ముందే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫీజు రూ.550లు. అభ్యర్థులు AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. అభ్యర్థులు చివరి తేదీలోపు అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్
అభ్యర్థుల సౌలభ్యం కోసం ఈ దిగువున ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 డైరక్ట్ లింక్‌ని అందజేశాం.AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ - Click Here ! |
---|
ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు
AP ICETని ట్రాక్ చేయడానికి ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందజేశాం.
ఈవెంట్స్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల | మార్చి 17, 2023 |
ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఫార్మ్ విడుదల | మార్చి 20, 2023 |
ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేసే చివరి తేదీ | ఏప్రిల్ 19, 2023 |
INR 1,000/- ఆలస్య రుసుముతో AP ICET అప్లికేషన్ ఫార్మ్ 2023 సబ్మిట్ కోసం చివరి తేదీ | ఏప్రిల్ 20-26, 2023 |
INR 2,000/- ఆలస్య రుసుముతో AP ICET అప్లికేషన్ ఫార్మ్ 2023 సమర్పణ కోసం చివరి తేదీ | ఏప్రిల్ 27, 2023 - మే 5, 2023 |
రూ. 3,000 ఆలస్య రుసుముతో AP ICET అప్లికేషన్ ఫార్మ్ 2023 సబ్మిషన్‌కి చివరి తేదీ | మే 4-10, 2023 |
రూ. 5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | మే 11-15, 2023 |
ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో | మే 16-17, 2023 |
ఏపీ ఐసెట్ 2023 పరీక్ష తేదీ | మే 24 మరియు 25, 2023 |
ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి స్టెప్స్
విద్యార్థులు తమ ఏపీ ఐసెట్ 2023 రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయడానికి ఈ కింది స్టెప్స్‌ని అనుసరించాలి:
స్టెప్ 1: రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
స్టెప్ 2: చెల్లింపు స్థితిని చెక్ చేసుకోవాలి
స్టెప్ 3: ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని అభ్యర్థులు తమ విద్యా సంబంధిత, వ్యక్తిగత వివరాలతో పూరించాలి. తర్వాత చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి.
దరఖాస్తుదారులు భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.AP ICET పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లను పొందడానికి CollegeDekho Education News కు వేచి ఉండండి. news@collegedekho.comలో మాకు వ్రాయండి.