ఏపీ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్ష తేదీల సమాచారం (AP Inter First Year and Second Year Timetable 2023)
ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సర పరీక్ష తేదీలను(AP Inter Exam Date 2023) బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ 26వ తేదీన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకూ నిర్వహించబడతాయి. క్రింద ఇవ్వబడిన పట్టికలో ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ (AP Intermediate Exam Dates 2023 ) వివరంగా అందించబడ్డాయి. విద్యార్థుల స్ట్రీమ్ సబ్జెక్టులు మాత్రమే కాకుండా పర్యావరణం, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష తేదీ కూడా ఇక్కడ అందించబడింది. ఈ టైం టేబుల్ ప్రకారం ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడతాయి.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు 2023 (AP Inter Exam Date 2023)
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు 2023 ఈ క్రింది పట్టికలో వివరించబడ్డాయి.కార్యక్రమం | తేదీ |
---|---|
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష తేదీ | మార్చి 15 నుండి ఏప్రిల్ 3, 2023 వరకు |
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష తేదీ | మార్చి 16 నుండి ఏప్రిల్ 4, 2023 వరకు |
ప్రాక్టికల్ పరీక్షలు | ఏప్రిల్ మరియు మే 2023 |
ఫలితాలు | మే 2023 |
ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర టైమ్‌టేబుల్ 2023 (AP Inter First-Year Timetable 2023)
ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల 2023 సబ్జెక్ట్ వారీ టైమ్‌టేబుల్ ఇక్కడ గమనించవచ్చు.
సబ్జెక్టు పేరు | తేదీ |
---|---|
2వ లాంగ్వేజ్ | మార్చి 15, 2023 |
ఇంగ్లీష్ | మార్చి 17, 2023 |
| మార్చి 20, 2023 |
| మార్చి 23, 2023 |
| మార్చి 25, 2023 |
| మార్చి 28, 2023 |
| మార్చి 31, 2023 |
| ఏప్రిల్ 3, 2023 |
ఏపీ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర టైమ్‌టేబుల్ 2023(AP Inter Second-Year Timetable 2023)
ఏపీ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షల 2023 సబ్జెక్ట్ వారీ టైమ్‌టేబుల్ ఇక్కడ గమనించవచ్చు.
సబ్జెక్టు పేరు | తేదీ |
---|---|
2వ లాంగ్వేజ్ | మార్చి 16, 2023 |
ఇంగ్లీష్ | మార్చి 18, 2023 |
| మార్చి 21, 2023 |
| మార్చి 24, 2023 |
| మార్చి 27, 2023 |
| మార్చి 29, 2023 |
| ఏప్రిల్ 1, 2023 |
| ఏప్రిల్ 4, 2023 |
ఏపీ ఇంటర్మీడియట్ టైమ్‌టేబుల్ 2023 PDF (AP Inter Timetable 2023 PDF)
ఏపీ ఇంటర్మీడియట్ టైం టేబుల్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు క్రింద పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు 2023 PDF - Click Here |
---|
ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర మరియు రెండవ సంవత్సర విద్యార్థుల కోసం అధికారిక వెబ్సైటు bie.ap.gov.in లో పరీక్ష తేదీలను (AP Inter Timetable 2023 PDF) విడుదల చేశారు. పరీక్షకు- పరీక్షకు మధ్య విద్యార్థులకు ఒక రోజు సమయం ఉంటుంది, కొన్ని పరీక్షలకు మాత్రం ఈ సమయం రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంది. విద్యార్థులు వారి టైం టేబుల్ చెక్ చేసుకోవడం ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు. ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు 2023 ( AP Intermediate Hall Tickets 2023) ఫిబ్రవరి 2023 లో విడుదల కానున్నాయి.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష 2023కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం CollegeDekho Education News తో చూస్తూ ఉండండి.