ఏపీ ఇంటర్మీడియట్ 2023 ఫలితాల తేదీ (AP Intermediate Results 2023 Date):
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. AP ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 15, ఏప్రిల్ 3 మధ్య జరిగాయి. AP ఇంటర్ 2023 రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 16, ఏప్రిల్ 4, 2023 వరకు జరిగాయి. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు BIEAP ఇంటర్ పరీక్షను ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఒకే షిఫ్ట్‌లో నిర్వహించింది. పరీక్షకు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలపై తాజా అప్‌డేట్‌ని ఈ ఆర్టికల్లో అందించడం జరిగింది.
గత ట్రెండ్‌లని అనుసరించి ఇంటర్ ఫలితాల తేదీని మే నెల చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. జూన్‌లో ఫలితాలు ప్రకటించబడతాయి. విద్యార్థులు తమ రిజల్ట్స్‌ని తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీతో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
AP ఇంటర్ ఫలితాలు 2023: ఫలితాలను చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి (AP Inter Result 2023: Follow these steps to check Result)
ఏపీ ఇంటర్ ఫలితాలు 2023ను విద్యార్థులు చెక్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి. ఇంటర్ రిజల్ట్స్‌ని విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in కి వెళ్లాలి
- హోంపేజీలో ఫలితాల ట్యాబ్‌ని గుర్తించాలి
- ఆపై ఇంటర్మీడియట్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి. లేదా రెండో సంవత్సరం ఇంటర్ ఫలితాల లింక్‌ని గుర్తించి, దానిపై క్లిక్ చేయాలి
- తర్వాత పుట్టిన తేదీతో పాటు హాల్ టికెట్ నెంబర్ ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
పరీక్షలు ముగియడంతో ఇప్పటికే ఇంటర్ బోర్డు పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియని ప్రారంభించింది. ఈ ప్రక్రియని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10, 03, 990 మంది హాజరయ్యారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,84,197 మంది కాగా సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు.
తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి