ఏపీ ఇంటర్ ఫలితాల తేదీ 2024 (AP Inter Results Expected Release Date 2024) : బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) AP ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు 2024 ఫలితాలను పరీక్షలు ముగిసిన ఒక నెలలోపు విడుదల చేస్తుంది. బోర్డు AP ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించగా, ఏపీ ఇంటర్ రెండో సంవత్సర పరీక్షను మార్చి 2 నుంచి మార్చి 20 వరకు నిర్వహించింది. BIEAP ఇప్పటివరకు అధికారిక ఏపీ ఇంటర్-ఎగ్జామ్ ఫలితాల తేదీని (AP Inter Results Expected Release Date 2024) తెలియజేయలేదు. అయితే మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ఆధారంగా బోర్డ్ ఆన్‌లైన్ ఫలితాలను ఏప్రిల్ 2024 రెండో లేదా మూడో వారంలోపు విడుదల చేయవచ్చు. మునుపటి సంవత్సరం ట్రెండ్‌లు, అంచనా ఫలితాల తేదీ గురించి సమగ్ర విశ్లేషణ ఇక్కడ అందించబడింది.
ఏపీ ఇంటర్ ఫలితాలు అంచనా విడుదల తేదీ 2024 (AP Inter Result Expected Release Date 2024)
ఫలితాలు BIEAP అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in లో ప్రకటించబడతాయి. మార్చి 20న ముగిసిన ఏపీ ఇంటర్ మొదటి, 2వ సంవత్సరం పరీక్షల కోసం మునుపటి తేదీల ప్రకారం అంచనాగా ఫలితాల తేదీలను ఇక్కడ చెక్ చేయండి.
పరామితి | వివరాలు |
---|---|
ఏపీ ఇంటర్ పరీక్ష చివరి తేదీ 2024 | మార్చి 20, 2024 |
ఏపీ ఇంటర్ ఆశించిన ఫలితాలు తేదీ 2024 | ఏప్రిల్ 2024 రెండు లేదా మూడో వారం |
ఊహించిన గ్యాప్ రోజులు | 25 నుంచి 30 రోజులు |
అధికారిక వెబ్‌సైట్ | bie.ap.gov.in |
AP ఇంటర్ ఫలితాల తేదీ 2024: మునుపటి ట్రెండ్‌లు
AP ఇంటర్ ఫలితాల ప్రకటనకు సంబంధించి మునుపటి ట్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి:
పరీక్ష సంవత్సరం | AP ఇంటర్ పరీక్ష చివరి తేదీ | ఫలితాల ప్రకటన | గ్యాప్ డేస్ |
---|---|---|---|
2023 | ఏప్రిల్ 4, 2023 | ఏప్రిల్ 26, 2023 | 22 రోజులు |
2022 | 12 ఆగస్టు, 2022 | 30 ఆగస్టు, 2022 | 18 రోజులు |
2021 (కోవిడ్ సంవత్సరం) | మే 23, 2021 | జూలై 23, 2021 | 60 రోజులు |
ఏపీ ఇంటర్ ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేయడానికి రెండో సంవత్సరం విద్యార్థులు బోర్డు ఫలితాల కార్డ్‌లను విడుదల చేసిన తర్వాత వారి బోర్డ్ రోల్ నెంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి. BIE ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు 2024 అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రకటించబడుతుంది. ఫలితాలను డౌన్‌లోడ్ చేయడానికి ఇతర పోర్టల్ ఏదీ ఉపయోగించబడదు. ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం ఫలితం 2024కి సంబంధించిన మార్కు షీట్‌లు, ఉత్తీర్ణత సర్టిఫికెట్‌లు విద్యార్థులకు వారి సంబంధిత పాఠశాలల నుంచి మాత్రమే వ్యక్తిగతంగా ఇవ్వబడతాయి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి.