ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 వచ్చేశాయి, రీ చెకింగ్, రీ వాల్యూయేషన్ (AP Inter Marks 2024 Revaluation) : ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 ప్రకటన తర్వాత BIEAP AP ఇంటర్మీడియట్ రీ చెకింగ్, రీ వాల్యుయేషన్ (AP Inter Marks 2024 Revaluation) అప్లికేషన్ ఫార్మ్‌ను విడుదల చేస్తుంది. ఇంటర్ ఫలితాల 2024తో సంతృప్తి చెందని విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల రీవాల్యుయేషన్ లేదా ఆన్‌లైన్ మోడ్‌లో రీచెకింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 ఏప్రిల్ 12, 2024న విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితం 2024తో పాటు బోర్డు ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 కీలక గణాంకాలు, ముఖ్యాంశాలను ప్రకటించింది. అయితే విద్యార్థులు తమకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందకపోతే, వారు రీవాల్యుయేషన్ కోసం 18వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీ ఇంటర్ ఫలితం 2024ని మళ్లీ చెక్ చేస్తారు. ఇంటర్ ఫలితం 2024 రీచెకింగ్/రీవాల్యుయేషన్ విండో త్వరలో ఓపెన్ అవుతుంది. ఏపీ ఇంటర్ రీచెకింగ్, రీవాల్యుయేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంది.
ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 రీ చెకింగ్, రీ వాల్యుయేషన్ (AP Inter Results 2024: Re-checking, Revaluation)
ఏపీ ఇంటర్ ఫలితాలతు రీ వాల్యుయేషన్, రీ చెకింగ్ అనేవి వేర్వేరు. విద్యార్థులు తప్పనిసరిగా రెండింటి మధ్య తేడాలని గమనించాలి. రీ కౌంటింగ్ విధానంలో మరోసారి మార్కుల రీ కౌంటింగ్ ఉంటుంది. ఈ విధానంలో మార్క్‌షీట్‌లో మార్కులు సరిగ్గా కేటాయించబడ్డాయని నిర్ధారించుకోవచ్చు. రీ-వెరిఫికేషన్‌లో జవాబు స్క్రిప్ట్‌ల రీవాల్యుయేషన్ జరుగుతుంది. మూల్యాంకనం చేసిన ఆన్సర్ స్క్రిప్ట్ స్కాన్ చేసిన కాపీని విద్యార్థికి అందిస్తారు.ఏపీ ఇంటర్ ఫలితాలను 2024 రీ వాల్యుయేషన్, రీ చెకింగ్ కోసం అప్లై చేసుకునే విధానం (Steps to apply for AP Inter Results 2024 Revaluation/ Re-checking)
ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 రీవాల్యుయేషన్ లేదా రీచెకింగ్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ కూడా బోర్డు వెల్లడిస్తుంది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఫలితం 2024 రీ-వెరిఫికేషన్ కోసం ఈ దిగువున చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.- ముందుగా అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ap.gov.inని సందర్శించాలి. హోంపేజీలో 'స్టూడెంట్' మెనూ బార్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ‘మార్కుల రీకౌంటింగ్’ లేదా ‘రివెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్డ్ స్క్రిప్ట్స్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాలి.
- తర్వాత ‘Get Data’పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు, వివరాలను ధ్రువీకరించి, SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.
- అవసరమైన ఫీజు చెల్లించి, పైనల్ దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ నెంబర్‌ను దగ్గరే ఉంచుకోవాలి.