ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష విధానంలో మార్పులు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ పరీక్ష విధానములో కొన్ని మార్పులను ప్రవేశపెట్టడానికి సిద్ధం అవుతుంది, ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్థులు మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు హాజరు అవుతున్నారు. రెండు సంవత్సరాలకు పబ్లిక్ పరీక్షలకు బదులుగా కేవలం రెండవ సంవత్సరం మాత్రమే పబ్లిక్ పరీక్షలను నిర్వహించే ఆలోచనలో ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలిస్తుంది. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు అంతర్గత మార్కులు ( ఇంటర్నల్ మార్క్స్) విధానం తీసుకునిరనున్నారు. ప్రస్తుతం ఇంటర్ లో ఎంపీసీ గ్రూప్ విద్యార్థులు మొదటి సంవత్సరంలో మ్యాథ్స్ 1A , మ్యాథ్స్ 1B, రెండవ సంవత్సరంలో 2A , 2B పరీక్షలు వ్రాస్తున్నారు. వీటి బదులుగా గణితం సబ్జెక్టులో సిలబస్ తగ్గించి ఒకటే పేపర్ గా నిర్వహించాలని బోర్డు భావిస్తుంది.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష విధానంలో మార్పులు ముఖ్యంశాలు 2025
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వచ్చే సంవత్సరం నుండి ఇంటర్ విద్యలో చేయదలచిన మార్పుల వివరాలు ఇక్కడ చూడవచ్చు.- రెండు సార్లకు బదులుగా ఒక సారి మాత్రమే పబ్లిక్ పరీక్షల నిర్వహణ
- మాథెమాటిక్స్ రెండు పేపర్లకు బదులుగా ఒకే పేపర్ 100 మార్కులకు పరీక్ష నిర్వహించడం
- వృక్షశాస్త్రం , జంతు శాస్త్రం సబ్జెక్టులను కలిపి ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడం
- మొదటి సంవత్సరం అంతర్గత మార్కలును ప్రవేశపెట్టడం
- ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు ఇంటర్నల్ మార్క్స్ విధానం ప్రవేశపెట్టడం
- ప్రాక్టికల్స్ కు 30 మార్కులు
- ప్రాక్టికల్స్ లేని సబ్జెక్టులకు 20 మార్కులకు ఇంటర్నల్స్