AP KGBV రిక్రూట్‌మెంట్ 2024 (AP KGBV Recruitment 2024) : ఆంధ్రప్రదేశ్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. AP KGBV రిక్రూట్‌మెంట్ 2024లో(AP KGBV Recruitment 2024) భాగంగా PGT, CRT, PET, ప్రిన్సిపాల్స్ ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 604 ఖాళీల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందించాం. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు 26 సెప్టెంబర్ 2024, 10 అక్టోబర్ 2024 మధ్య అధికారిక వెబ్‌సైట్ https://apkgbv.apcfss ద్వారా KGBVలోని పోస్ట్‌ల కోసం తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు . అన్ని కేటగిరీ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పూర్తి ప్రక్రియ, అవసరమైన అర్హతలు, వయో పరిమితి, మొత్తం ఖాళీల సంఖ్య ఇక్కడ అందించాం.
పోస్టుల వారీగా AP KGBV అవుట్ సోర్సింగ్ రిక్రూట్‌మెంట్ 2024 (AP KGBV Outsourcing Recruitment 2024 Post Wise Vacancies)
ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో పోస్టుల సంఖ్యను వివరంగా అందించాం.పోస్టుల ఖాళీలు | ఖాళీల సంఖ్య |
---|---|
ప్రిన్సిపాల్ | 10 |
PGT | 165 |
CRT | 163 |
PET | 4 |
పార్ట్ టైమ్ టీచర్స్ | 165 |
వార్డెన్లు | 53 |
అకౌంటెంట్స్ | 44 |
మొత్తం ఖాళీలు | 604 |
AP KGBV రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాలు (AP KGBV Recruitment 2024 Eligibility Criteria)
AP KGBV రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించిన అర్హత ప్రమాణాలను ఈ దిగువున అందించాం. అభ్యర్థులు చూడవచ్చు.- అభ్యర్థుల వయస్సు 1 జనవరి 2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC/ST/BC, వికలాంగ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
- అన్ని ఆప్షన్లు పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటాయి.
- అభ్యర్థులు అకడమిక్, ప్రొఫెషనల్ అర్హతలకు వెయిటేజీని అందుకుంటారు.
- అర్హతగల ST/SC/BC అభ్యర్థులు నిర్దిష్ట పోస్టులకు అందుబాటులో లేకపోతే ప్రత్యేక రిజర్వేషన్ మార్గదర్శకాల ప్రకారం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించి అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో apkgbv.apcfss.in దరఖాస్తు చేసుకోవాలి. రూ.250లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 10, 2024 చివరి తేదీ.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. విద్య, రిక్రూట్‌మెంట్ వార్తలను తెలుసుకోండి.