ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చట్టం అప్లికేషన్ ఫార్మ్ నేడు (23 మార్చి 2023)న విడుదల అయింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్ apsche.ap.gov.in సందర్శించి అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించవచ్చు. లాసెట్ 2023లో మంచి ర్యాంకును పొందితే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో మూడు సంవత్సరాల, ఐదు సంవత్సరాల LLB ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందవచ్చు. అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్‌లో విడుదల చేయబడింది. అప్లికేషన్‌ని ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేసే అవకాశం లేదు. ఏపీ లాసెట్ 2023 దరఖాస్తు ప్రక్రియలో దరఖాస్తు ఫీజును చెల్లించడం, అప్లికేషన్ ఫార్మ్ ఫైల్ చేయడం, చివరిగా ఫైల్ చేసిన దరఖాస్తు ప్రింట్ అవుట్ తీసుకోవడం వంటివి ఉంటాయి. ఓపెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 900, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 డైరెక్ట్ లింక్
ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయవచ్చు:
AP లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 : Click Here |
---|
ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 ముఖ్యమైన తేదీలు
ఈ దిగువన ఉన్న అభ్యర్థులు ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలని ఇక్కడ చెక్ చేయవచ్చు.
ఈవెంట్స్ | తేదీలు |
---|---|
AP LAWCET అప్లికేషన్ 2023 ప్రారంభం తేదీ | 23 మార్చి 2023 |
దరఖాస్తును పూరించడానికి మరియు సమర్పించడానికి చివరి తేదీ | 22 ఏప్రిల్ 2023 |
పరీక్ష తేదీ | 20 మే 2023 |
ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023ని ఎలా పూరించాలి?
AP LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.
- అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ని సందర్శించాలి. లేదా పైన పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవడానికి ముందుగా వారి పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, అవసరమైన డీటెయిల్స్ అందించాలి
- తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని యాక్సెస్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థి చెల్లింపు స్టేటస్‌ని చెక్ చేసుకోవాలి.
- చెల్లింపు ధ్రువీకరించబడిన తర్వాత అభ్యర్థి అప్లికేషన్ ఫార్మ్‌కి యాక్సెస్ చేసే అవకాశం దక్కుతుంది.
- తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌లో అభ్యర్థులు విద్యార్హతతో పాటు అవసరమైన డీటెయిల్స్, వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి.
- 10వ, 12వ తరగతి మార్కులు కార్డ్ వంటి అవసరమైన పత్రాలను కేటగిరీ సర్టిఫికెట్, సంతకం అప్‌లోడ్ చేయాలి
- తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుని అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్ అవుట్‌ని తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.