AP NEET కౌన్సెలింగ్ అంచనా ప్రారంభ తేదీ 2024 (AP NEET Counselling Expected Start Date 2024) : డాక్టర్ YS రావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (YSRUHS) AP NEET కౌన్సెలింగ్ ప్రారంభ తేదీ 2024ని (AP NEET Counselling Expected Start Date 2024) ఇంకా ప్రకటించ లేదు. అయితే మునుపటి సంవత్సరం డేటా ఆధారంగా, ఇది AIQ రౌండ్ 1 ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది. అనగా ఆగస్ట్ 31, 2024 తర్వాత ఇంకా ఆలస్యమైతే, AIQ రౌండ్ 2 ముగిసిన తర్వాత కూడా మొదలవ్వొచ్చు. అధికారిక షెడ్యూల్ ప్రకారం, AIQ రౌండ్ 2 సెప్టెంబర్ 22, 2024 తర్వాత ముగుస్తుంది. AP NEET కౌన్సెలింగ్ 2024 ప్రారంభమైన తర్వాత, అభ్యర్థులు drysruhs.edu.in లో దాని కోసం నమోదు చేసుకోవచ్చు.
AP NEET కౌన్సెలింగ్ ప్రారంభ తేదీ 2024 (AP NEET Counselling Expected Start Date 2024)
అభ్యర్థులు దిగువ పట్టికలో AP NEET కౌన్సెలింగ్ ప్రారంభ తేదీ 2024ని చెక్ చేయవచ్చు.
విశేషాలు | వివరాలు |
---|---|
AP NEET కౌన్సెలింగ్ 2024 ఆశించిన ప్రారంభ తేదీ 1 | ఆగస్టు 31, 2024 తర్వాత |
AP NEET 2024 కౌన్సెలింగ్ ఆశించిన ప్రారంభ తేదీ 2 | సెప్టెంబర్ 22, 2024 తర్వాత |
AP NEET 2024 కౌన్సెలింగ్ ప్రారంభ మోడ్ | ఆన్‌లైన్ |
AP NEET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ | drysruhs.edu.in |
ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సెలింగ్ 2024 ద్వారా, అభ్యర్థులు MBBS, BDS ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందగలరు. 85 శాతం రాష్ట్ర కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది, ఇందులో రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, ఛాయిస్ లాకింగ్, సీట్ అలాట్‌మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అడ్మిషన్ ప్రాసెస్ వంటి రౌండ్‌లు నిర్వహించబడతాయి. రిజిస్ట్రేషన్ సమయంలో, అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యా, అర్హత వివరాలను పూరించాలి. స్క్రీనింగ్ ప్రయోజనాల కోసం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తులు ఆమోదించబడిన వారు తమ కోర్సు/కళాశాల ప్రాధాన్యతను ప్రిఫరెన్స్ ఫార్మ్‌లో పూరించాలి, దాని ఆధారంగా సీటు అలాట్‌మెంట్ విడుదల చేయబడుతుంది. అలాట్‌మెంట్ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో పాటు సంబంధిత సంస్థలలో అడ్మిషన్ ప్రక్రియను నిర్వహిస్తారు.