AP PECET దరఖాస్తు ఫార్మ్ 2024 (AP PGECET 2024 Application Form) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు, APSCHE తరపున ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PECET 2024) కోసం నిర్వహించే సంస్థ, AP PECET 2024 రిజిస్ట్రేషన్, దరఖాస్తు కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విండోను (AP PGECET 2024 Application Form) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో DPEd ( రెండు సంవత్సరాలు) లేదా BPEd (2 సంవత్సరాలు) ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్‌ను కెరీర్‌గా కొనసాగించాలని కోరుకునే అర్హతగల విద్యార్థులు ఆలస్య ఫీజు లేకుండా చివరి తేదీ మే 15, 2024లోపు ఆన్‌లైన్ దరఖాస్తును పూరించవచ్చు. ముఖ్యమైన తేదీలు, రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ లింక్ ఇక్కడ ఉంది.
AP PECET దరఖాస్తు 2024 లింక్ (AP PECET Application Form 2024 Link)
నోటిఫికేషన్‌తో పాటు లింక్‌ను పరీక్ష అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో షేర్ చేశారు. AP PECET కోసం అప్లికేషన్ లింక్ దరఖాస్తుదారులను లాగిన్ పేజీలో తీసుకువెళ్తుంది. అక్కడ వారు ప్రాథమిక సమాచారాన్ని అందించడానికి నమోదు చేసుకోవాలి. ఈ దిగువున ఇవ్వబడిన AP PECET అప్లికేషన్ లింక్ 2024ని చూడండి:
AP PECET 2024 దరఖాస్తు ప్రక్రియ : ముఖ్యమైన తేదీలు (AP PECET 2024 Application Form: Important Dates)
ఈ దిగువ పట్టికలో ఆలస్యమైన దరఖాస్తు ఫీజుతో, లేకుండా రిజిస్ట్రేషన్ తేదీలతో పాటు దరఖాస్తు ప్రక్రియ పూర్తి షెడ్యూల్‌ను చెక్ చేయండి.
AP PECET ఈవెంట్‌లు 2024 | తేదీలు |
---|---|
AP PECET రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | మార్చి 28, 2024 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ (ఆలస్య ఫీజు లేకుండా) | మే 15, 2024 |
రూ.500 అదనపు ఆలస్య ఫీజుతో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ | మే 22, 2024 |
రూ.1000 అదనపు ఆలస్య ఫీజుతో రఖాస్తు చేయడానికి చివరి తేదీ | మే 29, 2024 |
దరఖాస్తు ఫార్మ్ దిద్దుబాటు విండో | మే 30, 31, 2024 |
శారీరక సామర్థ్యం, ఆటల నైపుణ్య పరీక్ష | జూన్ 4, 2024 (7 గంటల నుంచి) |
అధికారిక AP PECET నోటిఫికేషన్ 2024 PDF ప్రకారం, దరఖాస్తుదారులందరికీ ఒకే ఒక పరీక్ష కేంద్రం ఉంటుంది. అంటే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు క్యాంపస్, ఆంధ్రప్రదేశ్. అభ్యర్థులు నైపుణ్య పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందు అంటే పరీక్ష రోజున ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష చివరి తేదీ తర్వాత ఒక వారంలోగా విశ్వవిద్యాలయం దాని ఫలితాలను ప్రకటిస్తుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి.