ఏపీ పీజీ సెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ (AP PGECET 2023 Application Form) రిలీజ్ అయింది. అభ్యర్థులు మే 21, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థుల కోసం డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేశాం.
AP PGCET 2023 Application Form: ఏపీ పీజీసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే
ఏపీ పీజీ సెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ (AP PGECET 2023 Application Form):
ఏపీ పీజీ సెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ (AP PGECET 2023 Application Form) ఏప్రిల్ 1వ తేదీన విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి మే 11, 2023 చివరి తేదీ. ఆలస్య రుసుము రూ.500లతో అభ్యర్థులు మే 21, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ పీజీసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 డైరక్ట్ లింక్ ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGCET 2023) 2023 పరీక్షా తేదీలను APSCHE వెల్లడించింది. నోటిఫికేషన్ ప్రకారం AP PGCET 2023 పరీక్ష జూన్ 6 నుంచి జూన్ 10, 2023 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు యూనివర్సిటీల్లోని పలు కోర్సుల్లోనైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఏపీ పీజీసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్
https://cets.apsche.ap.gov.in/
లో విడుదల చేయడం జరిగింది. అభ్యర్థుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
AP PGCET 2023 ముఖ్యాంశాలు (Highlights of AP PGCET 2023)
ఏపీ పీజీసెట్ 2023కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇక్కడ చూడొచ్చు.
పరీక్ష పేరు
ఏపీ పీజీసెట్ 2023
కండక్టింగ్ అథారిటీ
APSCHE
ఎగ్జామ్ లెవల్
రాష్ట్రస్థాయి
దరఖాస్తు ప్రక్రియ మొదలైన తేదీ
ఏప్రిల్ 1, 2023
మోడ్ ఆఫ్ అప్లికేషన్
ఆన్‌లైన్
పరీక్ష తేదీ
జూన్ 06, 07, 08, 09, 10, 2023
పరీక్ష పద్ధతి
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
పరీక్ష మీడియం
ఇంగ్లీష్
ఏపీ పీజీసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి? (How to fill AP PGCET Application Form 2023)
ఏపీ పీజీ సెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని (AP PGECET 2023 Application Form) ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముందుగా AP PGCET 2023 అధికారిక వెబ్‌సైట్‌ని
https://cets.apsche.ap.gov.in/
సందర్శించాలి
ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ జనరేట్ అవుతుంది.
రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ అవ్వాలి.
హోంపేజీలో "Fill Application Form" అనే లింక్‌పై క్లిక్ చేయాలి
తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అందులో పర్సనల్ డీటైల్స్, విద్యా సంబంధిత వివరాలు ఇవ్వాలి
దరఖాస్తు నింపిన తర్వాత అవసరమైన పత్రాలు అంటే ఫోటో, సిగ్నేచర్, ఇన్‌కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ నెంబర్ వంటి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి
తర్వాత Payment Statusపై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి
ఫీజును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
అనంతరం ఒక్కసారి అప్లికేషన్‌ను చెక్ చేసుకుని ఫైనల్‌గా సబ్మిట్ చేయాలి.