ఏపీ పీజీసెట్ ఫస్ట్ సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు 2024 (AP PGCET First Phase Seat Allotment Result 2024) :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు జాబితాని ఈరోజు అంటే సెప్టెంబర్ 3, 2024న విడుదల చేయడానికి రెడీగా ఉంది. ఒకసారి విడుదల చేసిన తర్వాత, AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు స్థితిని చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్
pgcet-sche.aptonline.in
లో
డైరక్ట్ లింక్ అందుబాటులో ఉంది. AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితాన్ని (AP PGCET First Phase Seat Allotment Result 2024)
చెక్ చేయడానికి, అభ్యర్థులు AP PGCET రిజిస్ట్రేషన్ ID, పుట్టిన తేదీ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
ఇది కూడా చదవండి:
AP PGCET 2024 ఫేజ్ 1 సీట్ కేటాయింపు జాబితా ఎన్ని గంటలకు విడుదలవుతుంది?
ఇది కూడా చదవండి:
ఈరోజే APPGCET మొదటి సీటు కేటాయింపు జాబితా విడుదల
అభ్యర్థులు భర్తీ చేసిన ఆప్షన్లు, వారి మెరిట్, పాల్గొనే కళాశాలలకు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితాన్ని అధికారం విడుదల చేస్తుంది. AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు ద్వారా సీటు కేటాయించబడే అభ్యర్థులు దాంతో సంతృప్తి చెందితే సెప్టెంబర్ 4 నుంచి 10, 2024 మధ్య రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. దీని కోసం అభ్యర్థులు రిపోర్టింగ్ ప్రక్రియలో సీటు అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసి, కేటాయించిన కాలేజీలకు తీసుకెళ్లాలి.
AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితం 2024 డౌన్‌లోడ్ లింక్ (AP PGCET First Phase Seat Allotment Result 2024 Download Link)
AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితం 2024ని ఇక్కడ చెక్ చేయడానికి అభ్యర్థులు కింది డైరెక్ట్ లింక్ ద్వారా వెళ్లవచ్చు. అదేవిధంగా మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితాన్ని విడుదల చేసిన తర్వాత, అధికారం AP PGCET మొదటి దశ కళాశాలల వారీగా కటాఫ్ 2024ని విడుదల చేస్తుంది.
AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితం 2024- ఈరోజు యాక్టివేట్ అవుతుంది |
---|
AP PGCET మొదటి దశ ఇన్‌స్టిట్యూట్-వైజ్ కటాఫ్ 2024- ఈరోజు యాక్టివేట్ అవుతుంది |
AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితం 2024: ముఖ్యమైన సూచనలు (AP PGCET First Phase Seat Allotment Result 2024: Important Instructions)
ఇక్కడ అభ్యర్థులు AP PGCET మొదటి దశ సీట్ల కేటాయింపు 2024కి సంబంధించిన ముఖ్యమైన సూచనలను కింది విభాగంలో కనుగొనవచ్చు.
- అభ్యర్థులు అలాట్‌మెంట్‌తో సంతృప్తి చెందితే, వారు ముందుగా సీటును అంగీకరించాలి, సీటు అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి, అడ్మిషన్ ఫీజు చెల్లించాలి
- అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీలోగా రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలం కాకూడదు, లేకుంటే, కేటాయింపు రద్దు చేయబడుతుంది
- సీటు రాని అభ్యర్థులు లేదా ఫేజ్ 1లో కేటాయించిన సీట్లను అప్‌గ్రేడ్ చేయాలనుకునే అభ్యర్థులు తదుపరి రౌండ్ కేటాయింపు కోసం వేచి ఉండాలి. AP PGCET రెండో దశ కౌన్సెలింగ్ అధికారిక సమయాన్ని అధికారం ఇంకా ప్రకటించ లేదు. త్వరలో ఇదే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.