AP పాలిసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ పాలిసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023ని విడుదల చేసింది. ఏపీ పాలిసెట్ 2023 పరీక్షకు హాజరు కావడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ పాలిసెట్ 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించే SSC పరీక్షలో పాసై ఉండాలి. ఏపీ పాలిసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌లో (AP POLYCET application Form 2023) అవసరమైన వివరాలు ఫిల్ చేయడం, అప్లికేషన్ ఫీజు చెల్లించడం, అప్లికేషన్ సబ్మిట్ చేయడం వంటి దశలు ఉంటాయి. ఏపీ పాలిసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023ని సబ్మిట్ చేసే ముందు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఏపీ పాలిసెట్ పరీక్ష 10 మే 2023న జరగనుంది.
AP పాలీసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ : డైరెక్ట్ లింక్
ఏపీ పాలిసెట్ 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయవచ్చు-
AP POLYCET 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అప్లికేషన్ ఫార్మ్ - Click here |
---|
AP పాలిసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 ముఖ్యమైన తేదీలు
AP POLYCET అప్లికేషన్ ఫార్మ్ 2023 ముఖ్యమైన తేదీలు ఇక్కడ అందించాం.
ఈవెంట్ | తేదీలు |
---|---|
అప్లికేషన్ ఫార్మ్ 2023 విడుదల | 16 ఫిబ్రవరి 2023 |
ఏపీ పాలిసెట్ 2023 రిజిస్ట్రేషన్‌కి లాస్ట్ డేట్ | 30 ఏప్రిల్ 2023 |
AP పాలిసెట్ 2023 పరీక్ష | 10 మే 2023 |
ఫలితాల అంచనా తేదీ | 25 మే 2023 |
ఏపీ పాలిసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023: ముఖ్యమైన సూచనలు
అభ్యర్థులు AP POLYCET అప్లికేషన్ ఫార్మ్ 20232ని ఫిల్ చేసేటప్పుడు ఈ దిగువున అందజేసిన సూచనలు ఫాలో అవ్వాలి
- ఆఫ్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థులు అప్లికేషన్ నింపడం ప్రారంభించాలి.
- ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ పూరించే ప్రక్రియలో అభ్యర్థులు తమ వ్యక్తిగత పేర్లను పేర్కొనాలి. అది స్కూల్ సర్టిఫికెట్‌లో ఉన్నట్టే ఉండాలి.
- ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ పూరించే అభ్యర్థులు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి.
- అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు దానిని సబ్మిట్ చేయడానికి సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సందర్శించాలి. దాంతో పాటు అభ్యర్థులు కేటగిరీ వారీగా దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
- ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ పూరించే అభ్యర్థులు దరఖాస్తు ఫీజును నెట్ బ్యాంకింగ్ సాయంతో లేదా నగదు రూపంలో చెల్లించాలి.
- అలాగే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసే క్రమంలో అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అవసరమైన డాక్యుమెంట్లను, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ఉపయోగించి దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ న్యూస్ కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి.