AP పాలీసెట్ పరీక్ష తేదీ 2023 (AP POLYCET 2023 Exam Date): స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ AP POLYCET పరీక్ష తేదీ 2023ని విడుదల చేసింది. మే 10వ తేదీ ఈ పరీక్ష జరుగుతుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం AP POLYCET 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా SSC పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏపీ పాలిసెట్ 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏపీ పాలిసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేసే ముందు, అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని విజయవంతంగా సబ్మిట్ చేసే అభ్యర్థులు ఏపీ పాలిసెట్ 2023 హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP పాలిసెట్ అర్హత ప్రమాణాలు 2023
ఏపీ పాలిసెట్ 2023 (AP POLYCET 2023) పరీక్షకు దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులకు కొన్ని అర్హత ప్రమాణాలు ఉండాలి. ఏపీ పాలిసెట్ 2023 అర్హత ప్రమాణాలని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా SSC పరీక్షలో పాసైన అభ్యర్థులు AP పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- అభ్యర్థులు SSC పరీక్షలో మ్యాథ్స్ తప్పనిసరి సబ్జెక్టులలో ఒకటిగా ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని సబ్జెక్టుల్లో మొత్తం 35% మార్కులను పొంది ఉండాలి.
- SSC పరీక్షలో హాజరైన అభ్యర్థులు కూడా ఏపీ పాలిసెట్ 2023 పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.
ఏపీ పాలిసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ : ముఖ్యమైన సూచనలు
అభ్యర్థులు అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించేటప్పుడు AP POLYCET 2023కి సంబంధించిన ఈ కింది ముఖ్యమైన సూచనలను గుర్తు పెట్టుకోవాలి.
- అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లలో AP POLYCET అప్లికేషన్ ఫార్మ్ ని ఫిల్ చేయవచ్చు.
- ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా ఏపీ పాలిసెట్ అప్లికేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ విషయంలో అభ్యర్థులు నెట్ బ్యాంకింగ్‌ని ఉపయోగించి పే చేయాలి. లేదా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ విషయంలో అభ్యర్థులు క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ఫీజు చెల్లించాలి.
- ఏపీ పాలిసెట్ దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ, రిజర్వ్డ్ కేటగిరీకి వరుసగా రూ. 400, రూ. 200లు.
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి.