ఏపీ పాలిసెట్ 2023 నోటిఫికేషన్ (AP POLYCET Notification 2023): ఏపీ పాలిసెట్ 2023 నోటిఫికేషన్ (AP POLYCET Notification 2023) త్వరలో విడుదల కానుంది. AP POLYCET 2023 (Andhra Pradesh Polytechnic Common Entrance Test) రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష. ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ స్టేట్ బోర్డు ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఏపీ పాలిసెట్‌కు (AP POLYCET 2023) అప్లై చేసుకోవడానికి కొన్ని అర్హతలు ఉండాలి. అభ్యర్థులు ముందుగా అర్హత ప్రమాణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్, అర్హతలు గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు
ఏపీ పాలిసెట్ 2023 అర్హత ప్రమాణాలు (AP POLYCET 2023 Eligibility Criteria)
పాలిటెక్నికల్ డిప్లొమా కోర్సుల్లో జాయిన్ అయ్యేందుకు ఏపీ పాలిసెట్ 2023 (AP POLYCET 2023)ను నిర్వహిస్తుంటారు. ఏపీ పాలిసెట్‌లో సాధించిన స్కోర్, ర్యాంకుల ఆధారంగా కళాశాలల్లో సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షకు ఉండాల్సిన అర్హతల గురించి ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
ఏపీ పాలిసెట్ 2023 (AP POLYCET 2023)కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్టేట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి (SSC Examination) పాసై ఉండాలి. లేదా పదో తరగతికి సమానమైన తత్సమాన అర్హత ఉండాలి.
అభ్యర్థులు పదో తరగతిలో లేదా తత్సమాన విద్యలో కచ్చితంగా మ్యాథ్స్ సబ్జెక్ట్‌ను కలిగి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులు పొంది ఉండాలి.
ఇలా 35 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు AP POLYCET 2023 దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పదో తరగతి పూర్తైన వారితో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసిన వారు సైతం AP POLYCET 2023కి అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థి కచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి.
AP POLYCET 2023 రాయానులకునే అభ్యర్థులకు ఎటువంటి వయస్సు నిబంధన లేదు.
ఏపీ పాలిసెట్ 2023 మార్కులు, ప్రశ్నలు (AP POLYCET 2023 Examination Marks, Questions)
ఏపీ పాలిసెట్ 2023కి అప్లై చేసుకునే అభ్యర్థులు పరీక్షా విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రవేశ పరీక్షలో ఏ సబ్జెక్టుల్లో ఎన్ని ప్రశ్నలు ఇస్తారో ఈ కింద వివరంగా ఇవ్వడం జరిగింది.
ఏపీ పాలిసెట్ 2023 (AP POLYCET 2023)లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
మొత్తం 120 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలోనే ప్రశ్నలు ఉంటాయి.
ఫిజిక్స్‌కు సంబంధించి 30 ప్రశ్నలు, కెమిస్ట్రీకి సంబంధించి 30 ప్రశ్నలు, మ్యాథ్స్‌కు సంబంధించి 60 ప్రశ్నలు ఇస్తారు.
ప్రతి సరైన సమాధానానికి ఒక్క మార్కు చొప్పున వేస్తుంటారు. ఈ పరీక్షలో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అమల్లో లేదు.