ఏపీ పాలిసెట్ వెబ్ ఆప్సన్ల లింక్ 2024 (AP POLYCET Web Options Link 2024) : సాంకేతిక విద్యా శాఖ ఈరోజు, జూన్ 7న AP POLYCET 2024 వెబ్ ఆప్షన్‌ల లింక్‌ని (AP POLYCET Web Options Link 2024) యాక్టివేట్ చేస్తుంది. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత, రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు appolycet.nic.inలో వెబ్ ఆప్షన్‌లను చెక్ చేసి, మాన్యువల్ ఎంట్రీ ఆప్షన్ ఫార్మ్‌ను పూరించవచ్చు. సవరించిన షెడ్యూల్ ప్రకారం, AP POLYCET వెబ్ ఆప్షన్లు 2024ని పూరించడానికి చివరి తేదీ జూన్ 10, 2024. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ మూసివేయబడిన తర్వాత, జూన్ 7 నుంచి 10 మధ్య చివరిసారిగా అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్‌లను మార్చుకోవడానికి అనుమతించబడతారు.
AP POLYCET వెబ్ ఆప్షన్ల లింక్ 2024 (AP POLYCET Web Options Link 2024)
అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా AP POLYCET 2024 వెబ్ ఆప్షన్‌లకు నేరుగా లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు. త్వరలో జోడించడం జరుగుతుంది.AP POLYCET 2024 వెబ్ ఆప్షన్ల లింక్ |
---|
AP POLYCET 2024 వెబ్ ఆప్షన్ల లింక్
AP POLYCET వెబ్ ఆప్షన్లు 2024ని పూరించడానికి ఇక్కడ సూచనలు ఈ దిగువున అందించడం జరిగింది.- నిర్దిష్ట కళాశాల లేదా కోర్సు కోసం సీటు లభ్యతను పరిశోధించాలి.
- పరిశోధన, ప్రవేశ అవకాశాల ఆధారంగా మీ ప్రాధాన్యతలను షార్ట్‌లిస్ట్ చేయాలి. వాటిని ప్రాముఖ్యత అవరోహణ క్రమంలో అమర్చాలి.
- జిల్లా కోడ్, కళాశాల కోడ్, కోర్సు కోడ్‌ను ఇదే నమూనాలో గమనించాలి.
- మీ ప్రాధాన్యతలను 'ఆప్షన్ నెంబర్ 1'లో ఉంచే విధంగా మీ ప్రాధాన్యతలను నమోదు చేయాలి. ఆ తర్వాత 'ఆప్షన్ నెంబర్ 2'లో మీ రెండో ప్రాధాన్యత ఉంటుంది.
- వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను నమోదు చేయాలి. తద్వారా మీరు కనీసం ఏదో ఒక కళాశాలలో సీటు పొందవచ్చు.
- అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, జిల్లా కోడ్, కోర్సు కోడ్, కళాశాల కోడ్, పేర్కొన్న ఇతర వాటిని చెక్ చేసి, మార్పులు చేయాలి (అవసరమైతే).
- పూర్తి చేసిన తర్వాత, ఫార్మ్‌ను సబ్మిట్ చేసి జూన్ 13, 2024న సీట్ అలాట్‌మెంట్ విడుదలయ్యే వరకు వేచి ఉండాలి.