ఏపీ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలు 2024 నోటిఫికేషన్ (AP Postal GDS Jobs 2024 Notification) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. దేశవ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి 44,228 నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (AP Postal GDS Jobs 2024 Notification) విడుదలైంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 1355 ఖాళీలను, తెలంగాణాలో 981 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాకలు సంబంధించి అర్హత, దరఖాస్తు విధానం, పరీక్ష విధానాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాం.
ఇది కూడా చదవండి:
పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 44 వేలకుపైగా ఉద్యోగాలు, ఇలా అప్లై చేసుకోండి
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిజిస్ట్రేషన్ 2024 లింక్ (India Post GDS Registration 2024 Link)
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF - ఇక్కడ క్లిక్ చేయండి |
---|
ఏపీ పోస్టల్ ఉద్యోగాల లిస్ట్ PDF - ఇక్కడ క్లిక్ చేయండి |
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిజిస్ట్రేషన్ 2024 లింక్: ఇక్కడ క్లిక్ చేయండి |
ఏపీ పోస్టల్ జీడీఎస్ ఖాళీల వివరాలు 2024 (AP Postal GDS Jobs 2024)
ఏపీ పోస్టల్ జీడీఎస్ ఖాళీల వివరాలు 2024ని ఈ దిగువున అందించడం జరిగింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను ఇక్కడ పరిశీలించవచ్చు.
సర్కిల్ పేరు | UR | OBC | SC | ST | EWS | PWD-A | PWD -B | PWD-C | PWD-DE | మొత్తం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఆంధ్రప్రదేశ్ | 656 | 200 | 177 | 88 | 194 | 6 | 20 | 14 | 0 | 1355 |
తెలంగాణ | 454 | 210 | 145 | 54 | 97 | 5 | 5 | 10 | 1 | 981 |
ఏపీ పోస్టల్ ఉద్యోగాలు-విద్యార్హతలు
ఏపీ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు కొన్ని అర్హతలుండాలి. ఆ అర్హత ప్రమాణాలను ఈ దిగువున చూడండి
అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉండాలి
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
ఓబీసీ వారీకి మూడేళ్ల పాటు వయస్సు సడలింపు ఉంటుంది.
ఏపీ పోస్టల్ జీడీఎస్ పోస్టులు దరఖాస్తు ఫీజు
ఏపీ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100లు చెల్లించి అప్లై చేసుకోవాలి.
ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఆగస్ట్ 05, 2024తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగాలను కేవలం పదో తరగతి సర్టిఫికెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది.