ఏపీ ఆర్‌సెట్ 2023-24 (AP RCET 2023-24) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో ఖాళీగా పీహెచ్‌డీ సీట్ల భర్తీకి ఏపీ ఆర్‌సెట్‌ని (AP RCET 2023-24) నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు (Andhra Pradesh Research Common Entrance Test 2024) సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. AP RCET 2024 పరీక్షలు మే రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించనున్నట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు తెలియేశారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 19తో ముగిసింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ని చూడవచ్చు. ఏపీ ఆర్‌సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హతల వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.
AP RCET 2023-24 ముఖ్యమైన తేదీలు (AP RCET 2023-24 Important Dates)
AP RCET 2023-24 ముఖ్యమైన తేదీలను ఈ దిగువున పట్టికలో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.ఏపీ ఆర్‌సెట్ 2023-24 ఈవెంట్లు | ముఖ్యమైన తేదీలు |
---|---|
ఏపీ ఆర్‌సెట్ రిజిస్ట్రేషన్ 2024 చివరి తేదీ | మార్చి 19, 2024 |
రూ.2000ల లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | మార్చి 29, 2024 |
రూ.5000ల లేటు ఫీజుతో దరఖాస్తు చేసుకోవడాకికి చివరి తేదీ | ఏప్రిల్ 06, 2024 |
ఏపీ ఆర్‌సెట్ అప్లికేషన్‌లో కరెక్షన్ తేదీలు | ఏప్రిల్ 04 నుంచి ఏప్రిల్ 07, 2024 |
ఏపీ ఆర్‌సెట్ హాల్ టికెట్ల విడుదల తేదీ | ఏప్రిల్ 10, 2024 |
ఏపీ ఆర్‌సెట్ పరీక్షా తేదీలు | మే 2 నుంచి మే 05, 2024 |
ఏపీ ఆర్‌సెట్ 2024 అప్లికేషన్ విధానం (AP RCET 2024 Application Process)
APRCET 2024 అప్లికేషన్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్రవేశ పరీక్ష కోసం లేట్ ఫీజుతో ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం అభ్యర్థులు ముందుగా ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అభ్యర్థులు ఈ దిగువన అందించిన విధానాన్ని ఫాలో అవ్వొచ్చు.- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు AP RCET అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- స్టెప్ 2: హోంపేజీలో AP RCET 2024 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: ఫీజు చెల్లింపును పూర్తి చేసి, అవసరమైన వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- స్టెప్ 4: దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- స్టెప్ 5: ఫైనల్ సబ్మిషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.