ఏపీ ఆర్‌సెట్ ఫలితాలు 2024 (AP RCET Results 2024) : ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP RCET) 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. గత సంవత్సరాల ట్రెండ్‌లు, షెడ్యూల్ ప్రకారం మే 20న ఫలితాలు రిలీజ్ అవుతాయని నిపుణులు భావించారు. అయితే ఫలితాలు విడుదల కాలేదు. దీంతో ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ AP RCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని, అప్‌డేట్లను ఇక్కడ అందిస్తాం. కాగా ఏపీ ఆర్‌సెట్ 2024 (AP RCET Results 2024) పరీక్షలు మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 10,050 మంది దరఖాస్తుదారులలో 8651 (86.5 శాతం) మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మే 20న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. AP SET ఫలితాలు 2024 సంబంధిత వెబ్‌సైట్‌లో విడుదలవుతుంది. ఒక్కసారి ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP RCET ఫలితాలను 2024 ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check AP RCET Results 2024?)
AP RCET 2024 కోసం తమ ఫలితాలని ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవచ్చు.- షెడ్యూల్ ప్రకారం AP RCET ఫలితాలు 2024ని చెక్ చేయడానికి AU డైరక్ట్ లింక్‌ను అందిస్తుంది.
- అభ్యర్థులు ఏపీ ఆర్‌సెట్ 2024 ఫలితం లింక్ కోసం cets.apsche.ap.gov.in ఈ పేజీని కూడా చెక్ చేయవచ్చు.
- సంబంధిత వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి లేదా సైన్ ఇన్ అవ్వాలి.
- హోంపేజీలో ఫలితాలను లింక్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో సంబంధిత లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. దాంతో అభ్యర్థి ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
AP RCET స్కోర్ కార్డుపై ఉండే వివరాలు
AP RCET 2024 స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు పొందిన మొత్తం మార్కులు, అర్హత స్థితి, రోల్ నెంబర్ మొదలైన వాటిపై కొన్ని ముఖ్యమైన వివరాలను చూడవచ్చు. ఇది అభ్యర్థులు సరైన ఆలోచనను పొందడానికి సహాయపడుతుంది. వారి కొరత ఉన్న ప్రాంతాలు, వారు ఎక్కువ స్కోర్ చేసిన సబ్జెక్టులు.- సంస్థ పేరు
- అభ్యర్థి పేరు
- రోల్ నెంబర్
- దరఖాస్తు సంఖ్య
- పుట్టిన తేదీ
- అభ్యర్థి ఫోటో
- మొత్ం మార్కులు
అర్హత స్థితి తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.